Home > సినిమా > గుట్టుచప్పుడు కాకుండా 'గుడ్‌నైట్' హీరోయిన్ పెళ్లి

గుట్టుచప్పుడు కాకుండా 'గుడ్‌నైట్' హీరోయిన్ పెళ్లి

గుట్టుచప్పుడు కాకుండా గుడ్‌నైట్ హీరోయిన్ పెళ్లి
X

'గుడ్‌నైట్' సినిమాతో పాపులర్ అయిన చెన్నై భామ మీతా రఘునాథ్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. తెలుగులోకి డబ్ అయిన 'గుడ్ నైట్' మూవీని చూసి కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లోకి మీతా చేరిపోయింది. ఇంకో సినిమా ఎప్పుడొస్తుందోనని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. మీతా వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చేసేదేమీ లేక కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

గతేడాది గుడ్ నైట్ సినిమాతో ఆడియన్స్‌కు దగ్గరైన మీతా.. ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. సోషల్ మీడియాలో వరుస ఫోటోస్ పోస్ట్ చేసి ఈ బ్యూటీ మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. రెండు మూడు సినిమాలే చేసినా తన ఫోటోలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మరిప్పుడు బ్యాచులర్ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెట్టిన మీతా సినిమాలు చేస్తుందో? చేయదో తెలియడం లేదు. మొత్తానికి మీతా మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.


Updated : 19 March 2024 6:48 PM IST
Tags:    
Next Story
Share it
Top