గోపీచంద్ దూకుడు
X
హిట్ అనే మాటకు దూరమై కొన్నాళ్లు అవుతోన్న హీరో గోపీచంద్. మేచో స్టార్ గా తనకంటూ తిరుగులేని క్రేజ్ఉంది. అయితే ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతున్నాడు గోపీచంద్. ముఖ్యంగా మారుతున్న ప్రేక్షకుల టేస్ట్ కు అనుగుణంగా అతని కథలు కనిపించడం లేదు. అవుట్ డేటెడ్ స్టోరీస్ తోనే ఆకట్టుకోవాలనుకుంటున్న అతని ప్రయత్నాలన్నీ బాక్సాఫీస్ వద్ద బెడిసికొడుతున్నాయి. ఇప్పటికే అరడజనుకు పైగా ఫ్లాపులున్నాయి. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న రామబాణం దెబ్బకి అతని ఫ్యాన్స్ కు కూడా మతిపోయింది. అయినా అతని దూకుడు తగ్గడం లేదు.
కన్నడలో మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఏ హర్షతో భీమా అనే సినిమా చేస్తున్నాడు గోపీచంద్. భీమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియాభవానీ శంకర్ హీరోయిన్లు నటిస్తున్నారు. గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన గోలీమార్ తర్వాత ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు గోపీచంద్. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ చూస్తే ప్రామిసింగ్ గానే ఉంది. అయితే ఈ మూవీ తర్వాత కమిట్ అయిన ప్రాజెక్టే అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు దర్శకుడు శ్రీను వైట్ల. తను క్రియేట్ చేసిన జానర్ లోనే ఆగిపోయి ఫ్లాపులు చూశాడు. అతనూ వరుస డిజాస్టర్స్ తో ఉన్నాడు. అలాంటి దర్శకుడితో గోపీచంద్ సినిమాకు ఓకే చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన అతి కొద్ది టైమ్ లోనే షూటింగ్ స్టార్ట్ అయింది. శ్రీను వైట్లకు ఇష్టమైన ఇటలీ దేశంలో ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుందీ సినిమా. అక్కడ మిలన్ లో ఫస్ట్ షెడ్యూల్ ముగించుకుని వచ్చారు.
ఇక ఈ రెండు సినిమాలతో గోపీచంద్ బౌన్స్ బ్యాక్ అవుతాడనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. శ్రీను వైట్ల సినిమా వచ్చే వరకూ గ్యారెంటీ లేదు కానీ.. భీమాపై మాత్రం అంచనాలున్నాయి. వాటిని రీచ్ అయితే శ్రీను సినిమాక ప్లస్ అవుతుంది.