కొత్త బ్యూటీతో నాగచైతన్య డేటింగ్? ఎవరో చెప్పుకోండంటూ ఇన్స్టా పోస్ట్
X
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం వీళ్లిద్దరు విడాకులు తీసుకోగా.. ఇప్పటికీ ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారనేది ఎవ్వరికీ క్లారిటీ రాలేదు. దాంతో ఎవరికి తోచిన కథ వాళ్లు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు వాళ్ల లైఫ్ లో మూవ్ఆన్ అయిపోయి.. కెరీర్ పై దృష్టి పెట్టారు. అయినా.. జనాలు మాత్రం వాళ్ల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం మాత్రం ఆగట్లేదు. ఏదో ఒక పాత విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి తీసుకొచ్చి మళ్లీ చర్చలు మొదలు పెడుతున్నారు. వాళ్లు ఎవరితో తిరిగినా.. ఆ ఇద్దరికి లింక్ కలిపి గాసిప్స్ స్ప్రేడ్ చేస్తున్నారు.
ఇటీవల హుషారు హీరోయిన్ దక్షా నాగర్కర్ తో తిరుగుతున్నాడని, శోభితా దూలిపాలతో డేటింగ్ చేస్తున్నాడని నాగచైతన్యపై రూమర్స్ స్ప్రెడ్ చేశారు. సమంతను మర్చిపోయి మళ్లీ కొత్త ప్రేమను వెతుకున్నాడని స్టోరీలు అల్లారు. ఇప్పుడు నాగచైతన్య ఫ్యాన్స్ పేజ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఫొటో పట్టుకుని మరో కొత్త కథ తెరపైకి తెస్తున్నారు. ఆ ఫొటోలో చైతన్య.. స్కార్ఫ్ లో మరో అమ్మాయితో సెల్ఫీ దిగుతున్నాడు. అది చూసినవాళ్లంతా చైతన్యకు మరో అమ్మాయి దొరికింది. డేటింగ్ చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కానీ నిజానికి ఇది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా టైంలోది. ఫొటోలో ఉన్నది రకూల్ ప్రీత్ సింగ్. అప్పుడు దిగిన ఫొటోను ఫ్యాన్ పేజ్ తాజాగా పోస్ట్ చేయగా.. దాని చుట్టూ రూమర్స్ వచ్చాయి. విషయం తెలుసుకున్న చైతన్య ఫ్యాన్స్ కామెంట్స్ లో తిడుతున్నారు. అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేసి జీవితాన్ని ఆగం చేయొద్దని కోరుతున్నారు.
https://www.instagram.com/p/CwMFCaTpN8v/?utm_source=ig_web_copy_link