ఎండలెక్కువ ఉన్నై అని షూటింగ్కు రానన్న మహేశ్ బాబు
X
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కోంబోలో రాబోతున్న సినిమా గుంటూరు కారం. హైఎనర్జిటిల్ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సంక్రాంతి రేస్ లో ఉంటుంది అని అనుకున్నారంతా. అంతేకాకుండా షూటింగ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వార్త మహేశ్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఈపాటికే షూటింగ్ కు సంబంధించిన మరో షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా.. అది జరగడం లేదు.
టాలీవుడ్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం.. ఎండల తీవ్రత వల్ల మహేశ్ బాబు షూటింగ్ కు హాజరు కాలేనని చెప్పేశాడట. త్రివిక్రమ్ కు కూడా వేరే సినిమాల షెడ్యూల్స్ ఉండేసరికి.. మహేశ్ బాబు ప్రపోజల్ కు ఒప్పుకున్నాడు. దాంతో షూటింగ్ ను ఈ నెల 22 వరకు వాయిదా వేశారు. దాంతో సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఈ మూవీలో మహేష్ ఊర మాస్ రోల్ లో కనిపించనుండగా.. పూజ హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా చేస్తున్నారు.