Home > సినిమా > మహేష్ మాస్ ట్రీట్.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్..

మహేష్ మాస్ ట్రీట్.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్..

మహేష్ మాస్ ట్రీట్.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్..
X

గుంటూరు కారం.. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో గుంటూరు కారంలో ఉన్న ఘాటు ఎంతో తెలుసుకోవాలని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. తనదైన ఈజ్, కామెడీ టైమింగ్తో మహేష్ అదరగొట్టాడు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ మహేష్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి.

‘‘చూడంగానే మజా వచ్చిందా.. హార్ట్ బీట్ పెరిగిందా.. ఈల వేయాలనిపించిందా..?, కోడితే పెళ్లాం ముందు ఉంచుకున్న పేరు చెప్పాలి’’ వంటి డైలాగ్స్తో ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఉంది. ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు మరింత పెంచేశారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారమే జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా వేశారు. సంక్రాంతికి విడుదలవుతోన్న ఈ మూవీ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వెయిట్ అండ్ సీ..





Updated : 7 Jan 2024 9:59 PM IST
Tags:    
Next Story
Share it
Top