Home > సినిమా > మహేష్ ఫ్యాన్స్కు బర్త్ డే ట్రీట్.. అర్ధరాత్రి అదరగొట్టేందుకు..

మహేష్ ఫ్యాన్స్కు బర్త్ డే ట్రీట్.. అర్ధరాత్రి అదరగొట్టేందుకు..

మహేష్ ఫ్యాన్స్కు బర్త్ డే ట్రీట్.. అర్ధరాత్రి అదరగొట్టేందుకు..
X

గుంటూరు కారం.. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో దుమ్ములేపింది. ఊర మాస్ క్యారెక్టర్లో మహేష్ అదరగొట్టాడు. మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏమైనా ట్రీట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ మధ్య ఈ మూవీపై ఏదో ఒక బజ్ రావడమే ఈ అనుమానాలకు తావిచ్చింది.

ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ మూవీ యూనిట్ మహేష్ ఫ్యాన్స్కు ఖతర్నాక్ న్యూస్ తెలిపింది. మహేష్ బర్త్ డే అయిన అగస్ట్ 9న అర్థరాత్రి 12.06 నిమిషాలకు స్పెషల్ ట్రీట్ ఉంటుందని తెలిపింది. దీనికి సంబంధించి నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. ‘‘సూపర్ స్టార్ సూపర్ వేడుకలను మేం గ్రాండ్గా స్టార్ట్ చేస్తున్నాం..మీరు మాతో చేరండి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ నాగవంశీకి థ్యాంక్స్ చెప్తున్నారు.

బర్త్ డే ట్రీట్ ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లిరికల్ సాంగ్ అని కొందరు అంటుంటే.. పోస్టర్తో సరిపెడతారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఆ ట్రీట్ ఏంటిదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. కాగా ఈ మూవీలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ మూవీని తెరకెక్కిస్తుంది. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.




Updated : 8 Aug 2023 9:17 PM IST
Tags:    
Next Story
Share it
Top