Home > సినిమా > Book My Show : బుక్మై షోపై ‘గుంటూరు కారం’ ఫిర్యాదు.. కార‌ణం ఇదే.!

Book My Show : బుక్మై షోపై ‘గుంటూరు కారం’ ఫిర్యాదు.. కార‌ణం ఇదే.!

Book My Show : బుక్మై షోపై ‘గుంటూరు కారం’ ఫిర్యాదు.. కార‌ణం ఇదే.!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా శుక్రవారం (జ‌న‌వ‌రి 12) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించిన మహేష్ ను చూసి.. అభిమానులు థియోటర్లలో రచ్చ చేస్తున్నారు. మిక్స్డ్ టాక్ ను సొంత చేసుకున్న గుంటూరు కారం.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. దీంతో మహేష్ బాబుకు మరో బ్లాక్‌ బస్టర్ హిట్ పడింది. అయితే తాజాగా చిత్ర బృదం ప్ర‌ముఖ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్.. బుక్ మై షోపై కంప్లయింట్ ఫైల్ చేసింది. కారణం ఏంటంటే..?

గుంటూరు కారంకు వ్యతిరేకంగా 70వేల ఫేక్ ఓట్లు వేసి.. సినిమా రెప్యూటేషన్ ను దెబ్బతీశారనే చిత్ర బృదం ఆరోపిస్తుంది. దీనిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఫిల్మ్ చాంబర్ కూడా తమ సందేహాలు వ్యక్తం చేస్తూ.. బుక్ మై షోకు లేఖ రాసింది. సినిమాపై జరిపిన తప్పుడు ప్రచారం, ఫేక్ ఓటింగ్ పై ఆరా తీయాలని ఆ లేఖలో కోరారు. కాగా గుంటూరు కారం సినిమాకు మొదటి రోజు నుంచే ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. కథ రొటీన్ గా ఉందని, డైలాగ్స్ వర్కౌట్ కాలేదని, స్క్రీన్ ప్లే బోరింగ్ గా ఉందని కొంతమంది అభిమానులు తెలిపారు.




Updated : 15 Jan 2024 12:05 PM IST
Tags:    
Next Story
Share it
Top