Home > సినిమా > Guntur Karam : ఓటీటీలోకి గుంటూరు కారం..ఎక్కడంటే?

Guntur Karam : ఓటీటీలోకి గుంటూరు కారం..ఎక్కడంటే?

Guntur Karam :  ఓటీటీలోకి గుంటూరు కారం..ఎక్కడంటే?
X

(Guntur Karam) మహేశ్...ఆ పేరులో ఏదో వైబ్రేషన్స్ ఉన్నాయి. అమ్మాయిలందరికీ కలల రాకూమారుడు మన సూపర్ స్టార్ అనడంలో సందేహమేమి లేదు. అయితే తాజాగా మాస్ క్యారెక్టర్ లో అభిమానులను అలరించిన మహేశ్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమవుతుంది. సంక్రాంతి బరిలో నిలిచిన మూవీలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కరోనా టైంలో ఓటీటీలకు పెరిగిన క్రేజ్ మాములుగా కాదు. ఏ మూవీ రిలీజ్ అయినప్పటికీ నెల తర్వాత ఓటీటీలోకి రావాల్సిందే. ఓటీటీలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తుండడంతో వాటిని ఎక్కువ రైట్స్ పెట్టి కొనుగోలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలోకి నిలిచింది. గుంటూరు కారంతో పాటు మరో మూడు సినిమాలు సంక్రాంతి బరిలో వచ్చాయి.





అయితే, ఈ మధ్యే రిలీజ్ అయిన సినిమాలన్నీ మెల్లమెల్లగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన సైంధవ్‌ ఆల్‌రెడీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా మహేశ్‌బాబు మాస్ క్యారెక్టర్ తో రఫ్ ఆడించిన మూవీ గుంటూరు కారం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. దీంతో మహేశ్ బాబు అభిమానులు ఎగిరి గంతెస్తున్నారు.




Updated : 4 Feb 2024 5:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top