Home > సినిమా > గుడ్ న్యూస్ గుంటూరు కారం

గుడ్ న్యూస్ గుంటూరు కారం

గుడ్ న్యూస్ గుంటూరు కారం
X

మహేష్ బాబు ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్ ఇది. ఇప్పటి వరకూ ఉన్న డౌట్స్ అన్నీ క్లయిర్ అయిపోయే న్యూస్. నిర్మాత పదే పదే చెబుతున్న నిజమే అనిపించే వార్త ఇది. ఇప్పుడీ వార్తకు ఎంత ఇంత ఇంపార్టెన్స్ అంటే.. అసలే ఇవాళా రేపూ రిలీజ్ డేట్స్ విషయంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. దీంతో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారం సంక్రాంతి బరిలో ఉంటుందా లేదా అని ఫ్యాన్స్ ఎక్కడో ఓ డౌట్ ఉంది. ఇక ఆ డౌట్ అక్కర్లేదు. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు ఈ మూవీ కోసం మహేష్ బాబు చాలా వేగంగా షూటింగ్ అయ్యేలా సహకరించాడు. ఈ మేరకు త్రివిక్రమ్ కూడా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఆల్రెడీ టాకీ పార్ట్ కు దాదాపు పూర్తయింది. రీసెంట్ గా రెండు పాటల చిత్రీకరణ అయిపోయింది. ఈ వారంలోనే కేరళలో శ్రీ లీలతో మరో డ్యూయొట్ షూట్ చేయబోతున్నారు. దీంతో పాటల పని కూడా అయిపోతుంది. అన్నీ కుదిరితే ఈ నెల 10 తర్వాత మరో లిరికల్ సాంగ్ విడుదల చేసినా ఆశ్చర్యం లేదు. మరో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే.. ఈ నెల 3వ వారానికే షూటింగ్ మొత్తం అయిపోతుందట. అంటే ఈ పాట తర్వాత ఏమైనా ప్యాచ్ వర్క్ ఉంటే వాటితో కలిపే కంప్లీట్ గా గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. సో.. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో ఎక్కువగా అవసరం లేని సినిమా కాబట్టి.. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ పట్టదు. అందువల్ల ప్రొడక్షన్ హౌస్ ముందు నుంచీ చెబుతున్నట్టుగానే ఈ గుంటూరు కారం.. సంక్రాంతి బరిలో సత్తా చాటేందుకు జనవరి 12న ఖచ్చితంగా విడుదల కాబోతోంది. సో.. మహేష్ ఫ్యాన్స్ కు ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంటుందీ..

Updated : 5 Dec 2023 3:25 PM IST
Tags:    
Next Story
Share it
Top