Home > సినిమా > పండుగ వేళ 'హనుమాన్‌' నుంచి స్పెషల్ పోస్టర్‌

పండుగ వేళ 'హనుమాన్‌' నుంచి స్పెషల్ పోస్టర్‌

పండుగ వేళ హనుమాన్‌ నుంచి స్పెషల్ పోస్టర్‌
X

యంగ్‌ హీరో తేజ సజ్జ (Teja sajja) నటిస్తోన్న సినిమా ‘హను - మాన్‌’ (Hanu Man). ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు.. టాలీవుడ్‌ సహా అన్ని వుడ్‌లలోనూ ఉహించని స్థాయిలో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను సెప్టెంబర్‌ 18 నుంచి ప్రారంభించనున్నట్లు ఇటీవలే దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు. చెప్పినట్లుగానే వినాయక చవితికి స్పెషల్‌ పోస్టర్‌తో ప్రమోషన్‌లు షురూ చేశారు. తేజ సజ్జా వినాయకుడిని ఎత్తుకున్న పోస్టర్‌ ఆకట్టుకుంటుంది.

‘అ!’ ‘క‌ల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి సినిమాలో విభిన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ.. ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో జనాల్లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్‌ నటిస్తుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తుంది. డాక్టర్‌ ఫేం వినయ్‌రాయ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రైమ్ షో ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా తెలుగు సహా 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నది. అందులో కొరియన్‌, జపనీస్‌, ఇంగ్లీష్‌, స్పానీష్‌, చైనీస్‌ భాషలు కూడా ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని భాషల్లో రిలీజవడం ఇదే తొలిసారి.




Updated : 18 Sept 2023 12:03 PM IST
Tags:    
Next Story
Share it
Top