Home > సినిమా > తెలుగు సినిమా చరిత్రలోనే హనుమాన్ మూవీ రికార్డు

తెలుగు సినిమా చరిత్రలోనే హనుమాన్ మూవీ రికార్డు

తెలుగు సినిమా చరిత్రలోనే హనుమాన్ మూవీ రికార్డు
X

హనుమాన్ మూవీ (Hanuman movie) టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా నిలవడం విశేషం. తేజ సజ్జా(Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ మూడు వారాల్లోనే సుమారు రూ.300 కోట్ల కలెక్షన్లకు చేరువైంది.ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ (Blockbuster) అందుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఏ మూవీ న‌మోదు చేయ‌ని మ‌రో అరుదైన రికార్డును అందుకుంది. 92 ఏళ్ల తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ‘ఆల్​ టైమ్ సంక్రాంతి బ్లాక్​బస్టర్’​గా ‘హనుమాన్‌’ చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ అధికారికంగా ట్విట్టర్​లో షేర్​ చేసింది. మ‌రోవైపు ఈ మూవీకి సీక్వెల్ ఉంటుంద‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashant Verma) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్‌’ సినిమా రానుంది. ‘జై హనుమాన్ కు సంబంధించి ఇప్ప‌టికే స్క్రిప్ట్ కూడా సిద్ధమ‌యిపోయిందని ప్ర‌శాంత్ వ‌ర్మ తెలిపాడు.

దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నైజాం ఏరియాలో హనుమాన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 12వ తేదీని గుంటూరు కారం మూవీతోపాటు ఈ సినిమా కూడా రిలీజైంది. అయితే తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో తెలుగు, హిందీల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. గుంటూరు కారం (Guntur karam)తోపాటు సైంధవ్, నా సామిరంగ మూవీస్ ను వెనక్కి నెట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. సంక్రాంతి సినిమాలకు తెలుగులో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏటా పెద్ద పెద్ద హీరోలు ఈ పండుగకు థియేటర్లలో సందడి చేస్తారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మహేష్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోల చిత్రాలు పొంగల్‌కి వచ్చాయి. కానీ ఏ మూవీ ఇప్పుడు హనుమాన్ స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. థియేటర్లలో మూడు వారాలుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హనుమాన్ సినిమా కాస్త ఆలస్యంగా ఓటీటీ (OTT)లోకి రానుంది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో మిగిలిన మూడు మూవీస్ ఫిబ్రవరిలోనే రిలీజ్ కానుండగా.. హనుమాన్ మాత్రం మార్చి రెండో వారంలోగానీ జీ5 ఓటీటీలో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమా కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




Updated : 2 Feb 2024 1:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top