Hanu Man OTT Release : ఓటీటీలోకి 'హనుమాన్' - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
X
యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ టేకింగ్ , డైరెక్సన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రికార్డులు మీద రికార్డులు సృష్టించింది. నిర్మాతలకు కాసుల పంట పండించింది. థియేటర్లలో రిలీజై నెలన్నర రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ కలెక్షన్లు వస్తున్నాయి. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'హనుమాన్' సినిమా ఓటీటీ రైట్స్ జీ - 5 ఫ్లాట్ ఫామ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. . ఈనేపథ్యంలో హనుమాన్ ని మార్చి 2న స్ట్రీమింగ్ చేయనున్నారనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
కాగా సినిమా రీలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఒప్పందం జరిగినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జనవరి 12న థియేటర్లలో సినిమా రిలీజ్ కాగా.. ఇక మార్చి 2న ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2 నుంచి హనుమాన్ సినిమా అన్ని భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. కాగా హనుమాన్ మూవీ టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు మేకర్స్.ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో హను-మాన్ టికెట్ ధర రూ.175లుగా ఉంది. ఇకపై ఈ టికెట్స్ రూ.100ల కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు.