Home > సినిమా > Hanuman Movie Team: రామయ్యకు హనుమాన్ టీమ్ భారీ విరాళం

Hanuman Movie Team: రామయ్యకు హనుమాన్ టీమ్ భారీ విరాళం

Hanuman Movie Team: రామయ్యకు హనుమాన్ టీమ్ భారీ విరాళం
X

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన హనుమాన్ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలున్నాయి. వాటికి తగ్గట్లుగానే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. హీరో, దర్శకుడు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తోంది. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ అందించడంపై సినీ ప్రియులంతా ఫిదా అవుతున్నారు. హిందీలో ఈ సినిమాకు అన్నీ హౌస్ ఫుల్ బోర్డులే పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. హను-మాన్ రెండవ వారాంతంలో దేశీయ, విదేశాలలో మ్యాగ్జిమమ్ ఆక్యుపెన్సీని చూసింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌తో పాటు, ప్రజల ఆదరాభిమానాలను అందుకుంది.





కాగా ఈ సినిమా విడుదలకు ముందే మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మంచి అనౌన్స్అమెంట్ అయితే చేసింది చిత్రబృందం. అదేంటంటే హను-మాన్ చిత్రం ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్స్ లో ప్రతి టికెట్ పై రూ.5 అయోధ్య రామమందిరానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారితో అనౌన్స్ చేపించారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పటి వరకూ 53,28,211 టికెట్లు అమ్ముడు కాగా.. వాటి ద్వారా వచ్చిన రూ.2,66,41,055 విరాళంగా ఇస్తున్నట్లు చెప్పింది. ‘హనుమాన్‌ ఫర్‌ శ్రీరామ్‌’ అని పేర్కొంటూ ఈ వివరాలను బహిర్గతం చేసింది. చిత్రబృందంతోపాటు, నిర్మాత నిరంజన్‌ రెడ్డిని సినీ ప్రియులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అలా హనుమాన్ ప్రీమియర్ షోల కోసం 2,97,162 టిక్కెట్లు విక్రయించగా వచ్చిన డబ్బుల నుండి రూ.14,85,810 చెక్కును ఇప్పటికే రామ్ మందిరానికి అందజేశారు.

అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ తిరిగే కథే హనుమాన్. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్‌రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ సినిమాలో ‘కోటి’ అనే వానరానికి ప్రముఖ నటుడు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు.







Updated : 21 Jan 2024 1:02 PM IST
Tags:    
Next Story
Share it
Top