Home > సినిమా > Hanuman Character Revealed: రానా కాదు.. రామ్ చరణ్ కాదు.. ఆ పాత్రలో నటించేది బాలీవుడ్ నటుడే

Hanuman Character Revealed: రానా కాదు.. రామ్ చరణ్ కాదు.. ఆ పాత్రలో నటించేది బాలీవుడ్ నటుడే

Hanuman Character Revealed: రానా కాదు.. రామ్ చరణ్ కాదు.. ఆ పాత్రలో నటించేది బాలీవుడ్ నటుడే
X

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా వచ్చిన సినిమా ‘హనుమాన్’. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్కి, తేజ సజ్జ యాక్టింగ్కి ప్రతీ ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. సినిమా చివర్లో ‘హనుమాన్’ సీక్వెల్ పై ఒక్కసారిగా ఆసక్తి పెంచేశాడు డైరెక్టర్. ఎండ్ టైటిల్స్ లో వచ్చే ఓ షాట్ సీక్వెల్ పై అంచనాలను భారీగా పెంచేసింది. ఆ షాట్ లో హనుమాన్ శ్రీరాముడికి ఒక మాట ఇచ్చినట్టుగా చూపించారు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్లో ఇతిహాస పాత్రలైనా ఆంజనేయుడు శ్రీరాముడిగా ఎవరు కనిపిస్తారనే విషయాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నెలకొంది.

‘హను-మాన్‌’ సక్సెస్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో ప్రశాంత్ వర్మ కీలక కామెంట్స్ చేశాడు. హనుమాన్ తేజ సజ్జ ఉండడని, వేరే హీరోలు మెయిన్ లీడ్ గా వస్తారని కన్ఫార్మ్ చేశాడు. అయితే సోషల్ మీడియా రూమర్స్ ప్రకారం హనుమాన్ సీక్వెల్ లో.. శ్రీరాముడి పాత్రలో రామ్ చరణ్, హనుమంతుడి పాత్రలో రానా కనిపిస్తారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ వార్తల్లో నిజం లేనట్లు తెలుస్తుంది. హనుమాన్ పాత్రలో నటించేది తెలుగు ఇండస్ట్రీ నుంచి కాదని స్పష్టం అవుతుంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి ప్రముఖ నటుడు ఒకరు రానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా హనుమాన్ పాత్ర కోసం బాలీవుడ్ లో కొందరు యాక్టర్స్ తో ఆడిషన్స్ కూడా మొదలుపెట్టారట. మేకప్, లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఆ నటుడిని ఎంపిక చేయబోతున్నారు. ఈ సినిమాలో దేశంలోని ప్రముఖులందరూ నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ వార్తలపై చిత్ర బృదం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.




Updated : 26 Jan 2024 9:05 AM IST
Tags:    
Next Story
Share it
Top