Happydays movie : హ్యాపీడేస్ ను మళ్లీ విడుదల చేస్తున్నారు
X
కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీడేస్ ఒకటి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలంటే ఆవారాగా తిరగుతూ లెక్చరర్స్ ను ఏడిపిస్తూ.. వారిని బఫూన్స్ గా చూపిస్తోన్న ట్రెండ్ లో వచ్చిన ఈ సినిమా ఎంతోమంది ఆలోచనలను మార్చేసింది. కాలేజ్ అంటే ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. కాలేజ్ లైఫ్ అనుభవించని వారు కూడా బాధపడేలా చేసింది. శేఖర్ కమ్ముల తన మార్క్ ను బలంగా చూపించిన సినిమా కూడా ఇదే.
వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా, గాయత్రిరావు, సోనియా దీప్తి, వంశీ చాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2007లో విడుదలైంది. వరుణ్ సందేశ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. తమన్నాకు ఫస్ట్ బ్రేక్ ఇదే. నిఖిల్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. అలా చాలామందికి కెరీర్ కూడా ఇచ్చిన హ్యాపీడేస్ ను మళ్లీ విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న రీ రిలీజ్ ట్రెండ్స్ లో హ్యాపీడేస్ మళ్లీ వస్తోంది. ఏప్రిల్ 12న ఏసియన్ సినిమావాళ్లు ఈ చిత్రాన్ని ఏపి, తెలంగాణల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. మరి అప్పట్లో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హ్యాపీడేస్ ఈ రీ రిలీజ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.