పవర్ స్టార్ బర్త్ డే ట్రీట్...హరిహర వీరమల్లు లేటెస్ట్ అప్‌డేట్
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డేకి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న‘హరి హర వీరమల్లు’కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చేందుకు క్రిష్ రెడీ అయ్యారు. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా చిత్రం వచ్చే సంవత్సరం మార్చిలో వెండితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. ఇదిలా ఉండగా..హరి హర వీరమల్లుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా హరి హర వీరమల్లు నుంచి సరికొత్త బ్రండ్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకుకు మేకర్స్ రెడీ అయ్యారు. సరిగ్గా సెప్టెంబర్ 02న మిడ్నైట్ 12:17 గంటలకు పోస్టర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయి. ఈ పోస్టర్లో ఎంముంటుందని ఆసక్తిగా పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
-