Home > సినిమా > ఫ్యాన్స్కు పవన్ ట్రీట్.. ఆ పండగ నాడే హరిహర వీరమల్లు ప్రోమో..?

ఫ్యాన్స్కు పవన్ ట్రీట్.. ఆ పండగ నాడే హరిహర వీరమల్లు ప్రోమో..?

ఫ్యాన్స్కు పవన్ ట్రీట్.. ఆ పండగ నాడే హరిహర వీరమల్లు ప్రోమో..?
X

హరిహర వీర మల్లు.. పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో వస్తోన్న కొత్త మూవీ. మూడేళ్ల క్రితం ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ ప్రారంభించిన తర్వాత పవన్ సైన్ చేసిన పలు సినిమాలు రిలీజ్ అయినా.. ఈ మూవీ మాత్రం విడుదలకు నోచుకోలేదు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అనే వీరుడి జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీకి సంబంధించి ఇటీవలే మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

త్వరలోనే అదిరిపోయే స్పెషల్ ప్రోమోతో ప్రేక్షకుల ముందుకు వస్తామని ప్రకటించింది. ఆ ప్రోమో ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని ట్వీట్ చేసింది. అయితే ఈ ప్రోమో శివరాత్రికి విడుదల అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే నెల 8న స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశ ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఏడాది తర్వాత సడెన్ సర్ప్రైజ్ ఇస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

మరోవైపు ఈ మూవీ డైరెక్టర్ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ విషయంపై మూవీ యూనిట్ గానీ, క్రిష్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఇటీవల మేకర్స్ ఇచ్చిన అప్డేట్లో క్రిష్ను ట్యాగ్ చేయడంతో సినిమా నుంచి ఆయన తప్పుకోలేదని తెలుస్తోంది. చాలాకాలంగా ఈ సినిమాపైనే ఉండడంతో వేరే సినిమాలు చేయలేకపోతున్నారని.. అందుకే హరిహర వీర మల్లు నుంచి క్రిష్ తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమాను ఎం రత్నం నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.

Updated : 19 Feb 2024 7:05 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top