Home > సినిమా > Harish Shankar : దేవుడి మీదే భారం.. నెటిజ‌న్‌కు హ‌రీష్ శంక‌ర్ కౌంట‌ర్‌

Harish Shankar : దేవుడి మీదే భారం.. నెటిజ‌న్‌కు హ‌రీష్ శంక‌ర్ కౌంట‌ర్‌

Harish Shankar : దేవుడి మీదే భారం.. నెటిజ‌న్‌కు హ‌రీష్ శంక‌ర్ కౌంట‌ర్‌
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దీనిని సంచలన దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ కు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇదిలా ఉండగా.. ట్విట్టర్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ కు ఓ అభిమాని ఆసక్తికర ట్వీట్ పెట్టాడు. ఇప్పటికే 50% షూటింగ్ అయిపొయిందట కదా అన్న.. క్వాలిటీ పై దేవుడి మీదే భారం వేశాం అని ట్వీట్ చేశాడు. దీనికి హరీష్ శంకర్ స్పందిస్తూ.. అంతే కదా తమ్ముడు. అంతకు మించి నువ్వేం చేయగలవు చెప్పు. ? ఈ లోగా కాస్త కేరీర్, జాబ్, స్టడీస్ మీద ఫోకస్ పెట్టు.. వాటిని మాత్రం దేవుడికి వదిలెయ్యకు.. ఆల్ ది బెస్ట్" అని సూచించాడు.

దీనికి మరో అభిమాని స్పందిస్తూ కెరియర్ పోతే పోనీ అన్న.. మాకు ఉస్తాద్ భగత్‌సింగ్(UBS) ముఖ్యం. ఇంకో గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇవ్వు అన్నా.. అని రీప్లై ఇచ్చారు. మళ్ళీ దీనికి డైరెక్టర్ స్పందిస్తూ ''ఐ విల్ ట్రై మై బెస్ట్'' అని చెప్పాడు. దీనికి అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' ను తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' కాకుండా సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ', క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా కూడా చేయాల్సి ఉంది.




Updated : 20 Sept 2023 1:31 PM IST
Tags:    
Next Story
Share it
Top