Home > సినిమా > Harsha sai cinema: కేజీఎఫ్ లెవల్ ఎలివేషన్స్తో.. హర్షసాయి సినిమా

Harsha sai cinema: కేజీఎఫ్ లెవల్ ఎలివేషన్స్తో.. హర్షసాయి సినిమా

Harsha sai cinema: కేజీఎఫ్ లెవల్ ఎలివేషన్స్తో.. హర్షసాయి సినిమా
X

యూట్యూబర్ హర్షసాయి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ.. అలా వచ్చిన డబ్బుతో పేదలకు సాయం చేస్తూ వార్తల్లో నిలిచాడు. తనకు వచ్చిన 10 రూపాయల్లో 5 రూపాయలు సాయం చేస్తూ శభాష్ అనిపించుకున్నాడు. దాంతో హర్షసాయికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తన వాయిస్, స్టోరీ నరేషన్ కు ఫిదా అయినవాళ్లు చాలామందే. తాజాగా ఫ్యాన్స్ కు మరో గిఫ్ట్ ఇచ్చాడు. హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేశాడు. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

టీజర్ ని పూర్తి మాస్ గా తెరకెక్కించాడు. సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ‘మెగా’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశాడు. ఇక ఆ టైటిల్ కి క్యాప్షన్ గా.. ‘లో డాన్’ అని పెట్టాడు. మొదటి సినిమాకే మెగా టైటిల్ పెట్టడంతో.. ఈ మూవీ హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాను బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ తన సొంత బ్యానర్ శ్రీ పిక్చర్స్ పై నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాకు డైరెక్షన్, డైలాగ్ రైటింగ్ హర్షసాయి చేసినట్లు తెలుస్తుంది. టీజర్ చూస్తుంన్నంత సేపు.. కాస్త కేజీఎఫ్ సినిమా ట్రాన్స్ లోకి తీసుకుపోతుంది. స్టోరీ నరేషన్, వాయిస్ ఓవర్ చూస్తుంటే సినిమా హిట్ కొట్టే అవకాశం కనిపిస్తుంది.



Updated : 17 Sep 2023 2:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top