Bigg Boss 7 : అతనికి షార్ట్ టెంపర్ ఎక్కువ...రతిక దెబ్బకు తలపట్టుకున్న ప్రిన్స్..
X
బిగ్ బాస్ సీజన్ 7లో విజయవంతంగా మూడోవారం కొనసాగుతోంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తక్కువ జరుగుతున్నాయని, చాలా కూల్‌గా షో వెళ్లిపోతోందని ప్రేక్షకులు తెగ ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్‌కు కూడా అదే అనిపించింది కాబోలు ఎలాగైనా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో టాస్క్‌లు రసవత్తరంగా ఇస్తున్నాడు. నామినేషన్ కారణంగా హౌస్ మెంబర్స్ కొంతమంది వాదనలకు దిగుతున్నా అవి అంత రంజుగా ఉండటం లేదు. దాంతో తన అస్త్రమైన మూడో పవర్ అస్త్రను గెలుచుకునేందుకు టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. సీరియల్ నటులు అమర్ దీప్, శోభా శెట్టితో పాటు ప్రిన్స్ ఈ పవర్ అస్త్ర దక్కించుకోవడానికి అర్హుల అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు మూడో పవర్ అస్త్ర పొందేందుకు అర్హులో కంటెస్టెంట్స్ వారి అభిప్రాయాలను కన్ఫెషన్ రూమ్‌లో చెప్పాలన్నారు. దీంతో అందరూ తమకు నచ్చిన కంటెస్టెంట్ పేరును చెప్పారు.
ఇక అసలు సీన్లోకి వస్తే సాయంత్రం అందరిని ఓ చోట కూర్చోబెట్టి కన్ఫెషన్ రూమ్‌లో కంటెస్టెంట్లు మాట్లాడిన వీడియోను బిగ్ బాస్ ప్రదర్శించారు. దీంతో హౌస్‌లోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రిన్స్ యావర్ ఇంటిపనులు చేయడని అతడు పవర్ అస్త్ర పొందేందుకు కరెక్ట్ కాదు అని టేస్టీ తేజ చెప్పాడు. ఆ తర్వాత నాకు ప్రిన్స్‌కు పెద్దగా కనెక్షన్ లేదని, అతనికి తెలుగు రాదని, చెప్పేది అర్థం చేసుకోడని, అందరినీ వ్యతిరేకిస్తూ ఉంటాడని దామిని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మాత్రం ప్రిన్స్‌కు రతిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా రతిక కూడా ప్రిన్స్‌కు నెగెటివ్ గా మాట్లాడింది. నిన్నటి వరకూ లవ్ యూ అంటూ ప్రేమగా మాట్లాడిన రతిక కన్ఫెషన్ రూమ్‌లో అతడికే రివర్స్ అయ్యింది. ప్రిన్స్ బిగ్ బాస్ ఇంటి సభ్యునిగా పనికిరాడు అని తేల్చేసింది.
"ప్రిన్స్‌కి షార్ట్ టెంపర్ ఎక్కువ. అది ఈ హౌస్‌లో పనికి రాదు. ఫిజికల్ టాస్క్‌లో పర్లేదు. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో ఉండేందుకు అతడు కరెక్ట్ కాదు"అని రతిక ప్రిన్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ వీడియో చూసి ప్రిన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం అనలో అతడికి అర్థంకాలేదు. దీంతో పాపం అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోయాడు ప్రిన్స్. ఆ తర్వాత తేజ యావర్ దగ్గరకు వెళ్లి కదిలించాడు. ఇంటిపనులు చేయడానికి నేనేమైన నీ పెళ్ళన్నా అంటూ అతడిపై ప్రిన్స్ ఫైర్ అయ్యాడు. రతిక పాప కూడా తనకు రివర్స్ కావడంతో పాపం ప్రిన్స్ తట్టుకోలేకపోయాడు. ఛీ..ఛీ..అంటూ తలపట్టుకున్నాడు. దీంతో రతిక ఏమైంది ప్రిన్స్.. నా ఒపీనియన్ నేను చెప్పను అంతే అంటూ అక్కడి నుంచి జారుకుంది.