Home > సినిమా > ధర్మేంద్ర లిప్‎లాక్..హేమామాలిని రియాక్షన్ ఇదే

ధర్మేంద్ర లిప్‎లాక్..హేమామాలిని రియాక్షన్ ఇదే

ధర్మేంద్ర లిప్‎లాక్..హేమామాలిని రియాక్షన్ ఇదే
X

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్ , క్రేజీ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’. ఈ మధ్యనే బాక్సాఫీస్‎లో ఈ మూవీ విడుదలైంది. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ కరణ్ జోహార్‌ డైరెక్ట్ చేసిన ఈ మూవీ విడుదలై సక్సెస్‎ను సొంతం చేసుకుంది. అయితే, ఈ మూవీలోని కొన్ని సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాల్లో హాట్ టాపిక్‎గా మారాయి. సీనియర్ నటుడు ధర్మేద్రం, షబానా అజ్మీల లిప్‎లాప్ పైనే అందరూ చర్చించుకుంటున్నారు. 87 ఏళ్ల వయసులో ఇలాంటి సీన్స్ అవసరమా అంటే నెటిజన్స్ ధర్మేంద్రను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ముద్దు సీన్‎పై ధర్మేంద్ర భార్య హేమమాలిని రియాక్ట్అయ్యారు.

కిస్సింగ్ సీన్‎పై హేమమాలిని మాట్లాడుతూ. "నేను ఇప్పటి వరకు ఈ మూవీ చూడలేదు. ఈ సినిమా సక్సెస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ధర్మేంద్ర విషయంలోనూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన ఆన్ స్క్రీన్‎లో ఎప్పుడూ యాక్టివ్‎గానే ఉంటారు. కెమెరా ముందు ఆయన ఉత్సాహంగా కనిపిస్తారు. ఎందుకంటే ఆయన సినిమాను ఎంతగానో ప్రేమిస్తారు" అని చెప్పుకొచ్చింది హేమామాలిని.

ఇక లిప్‎లాక్ సీన్‎లో నటించిన షబానా అజ్మీ మాట్లాడుతూ..‘‘ స్ట్రాంగెస్ట్ విమెన్ లైఫ్‎లో రొమాన్స్‌ ఉండకూడదా? ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నాకు విపరీతమైన ఫోన్‌లు, మెసేజ్‌లు వస్తున్నాయి. డైరెక్టర్ కరణ్‌ జోహర్‌ ఎంతో రిస్క్‌ చేసి మరీ ఈ సీన్ పెట్టారు. ఈ మూవీకి వచ్చే క్రెడిట్స్ అన్నీ కూడా ఆయనకే చెందుతాయి’’ అని ఆమె తెలిపారు.


Updated : 4 Aug 2023 9:19 PM IST
Tags:    
Next Story
Share it
Top