షాక్‌లో బన్నీ.. సుకుమార్‌ను పట్టుకుని..
X
‘పుష్ప’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎన్నికైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు షాక్‌తో మాటలు రావడం లేదు. ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పుష్ప దర్శకుడు సుకుమార్, బన్నీ ఇద్దరూ గట్టిగా కావలించుకుని సంతోషం తట్టుకోలేక భోరున ఏడ్చేశారు. గురువారం జాతీయ అవార్డుల ప్రకటన రాగానే మైత్రీ మూవీ మేకర్స్ టీఎంతోపాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లి అభినందనలతో ముంచెత్తారు. ప్రతిష్టాత్మక అవార్డు కావడంతోపాటు తెలుగు నుంచి తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి ఘనతను కూడా సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ అల్లుగారి అబ్బాయికి నీరాజనాలు పడుతోంది.
అవార్డుపై స్పందించాలని మీడియా బన్సీని కోరగా, చేతి సైగలతో నిరాకరించారు. ‘‘షాక్‌లో ఉన్నాను.. తర్వాత మాట్లాడతాను’’ అని అన్నారు. 69 ఏళ్లా జాతీయ చలన చిత్ర అవార్డులో దక్షిణాదివారికి చాలామందికే వచ్చిన తొలిసారి తెలుగు నటుడికి రావడంతో బన్సీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పుష్పతో పాన్ ఇండియా హీరో ఇమేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పటికే పలు అవార్డులు కైవసం చేసుకున్నాడు.
Maverick director @aryasukku and our producers #NaveenYerneni garu and #RaviShankar garu shower their happiness and love on Icon Star @alluarjun for becoming THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#Pushpa ❤️🔥#ThaggedheLe pic.twitter.com/RvxX7NbKnM
— Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2023