Home > సినిమా > పిల్లనిచ్చిన మామ కోసం నల్గొండకు అల్లు అర్జున్..ఎందుకంటే..

పిల్లనిచ్చిన మామ కోసం నల్గొండకు అల్లు అర్జున్..ఎందుకంటే..

పిల్లనిచ్చిన మామ కోసం నల్గొండకు అల్లు అర్జున్..ఎందుకంటే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం నల్గొండలో పర్యటించనున్నరు. పిల్లను ఇచ్చిన మామగారి పేరు మీద నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‎ను అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా పెద్దవూర మండలంలోని తన సొంత గ్రామం చింతపల్లిలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా భట్టుగూడెం దగ్గర కంచర్ల కన్వెన్షన్ పేరుతో 1000 మందికి సరిపడే ఫంక్షన్ హాల్‎ను నిర్మించారు. దీని ఓపెనింగ్‎కు బన్నీ మామ ఇలాకాకు రానున్నాడు. దీంతో అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగా మొదలైంది. బన్నీ రాక సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి అల్లుడు అల్లు అర్జున్‎తో మంత్రి జగదీశ్‌రెడ్డిని పలువురు ఎమ్మెల్యేలను ఆయన ఆహ్వానించారు.ఈ సందర్భంగా 10 వేల మందికి చంద్రశేఖర్‌రెడ్డి భోజనాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు.

2014 ఎన్నికల్లోనే చంద్రశేఖర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 24 వేల పైచిలుకు ఓట్లును చంద్రశేఖర్‎రెడ్డి సాధించారు. రానున్న ఎన్నికల్లో తన స్వస్థలమైన నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే తన నియోజకవర్గంలో చంద్రశేఖర్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తన మామయ్య కోసం రాజకీయ వేడుకలో అల్లు అర్జున్‌ పాల్గొంటున్నారు. చంద్రశేఖర్‌రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సీట్‌ వస్తే కనుక అల్లు అర్జున తప్పకుండా మామ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టాక్ బాగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్‏లో తెరకెక్కనున్న పుష్ప2లో నటిస్తున్నారు. ఇండియా వైడ్‎గా సెన్సేషనల్ హిట్ సాధించిన పుష్ప కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మూవీ షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి నాటికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Updated : 19 Aug 2023 12:07 PM IST
Tags:    
Next Story
Share it
Top