Home > సినిమా > గీత దాటిన బాలయ్య..

గీత దాటిన బాలయ్య..

గీత దాటిన బాలయ్య..
X

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఆడియన్స్ లో ఒక అంచనా ఉంటుంది. బియాండ్ ద లైన్స్ ఉండే ఫైట్స్, సాధారణ మనుషులెవరూ వాడని లౌడ్ డైలాగ్స్.. మొత్తంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించేలాంటి కథ, కథనాలుంటాయి. ఇవి ఆయన చేస్తేనే బావుంటాయి. ఇంకెవరు చేసినా జనం నవ్వుకుంటారు. అందుకే బాలయ్య మూవీ అంటే ఒక రకంగా ప్రిపేర్ అయ్యే వెళతారు. అలాంటి వారిని ఎప్పుడో కానీ సర్ ప్రైజ్ చేయడు. అలాంటి సర్ ప్రైజ్ కు సిద్ధంగా ఉండాలి అనేలా ఆయన కొత్త సినిమా భగవంత్ కేసరి కనిపిస్తోంది. ఇప్పటి వరకూ తను ఏదైతే తన సేఫ్ లైన్ అనుకున్నాడో ఆ గీత దాటి చేస్తోన్న సినిమాలా ఉందీ భగవంత్ కేసరి.

ముఖ్యంగా లేటెస్ట్ గా వచ్చిన పాట చూస్తే ఈ బాలయ్య ఇప్పటి వరకూ చూసిన బాలయ్య కాదేమో అనిపిస్తుంది. తనదైన ఊరమాస్ యాక్షన్ డోస్ కు భిన్నంగా కాస్త క్లాస్ యాక్షన్ ఉండబోతున్నట్టు కనిపిస్తోంది. శ్రీ లీల ఆయన కూతురు పాత్రలో కనిపించబోతోంది. వీరికి సంబంధించిన పాటే ఇది. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాలా అంటూ సాగిన ఈ పాట చూస్తే ఖచ్చితంగా బాలయ్య చాలాకాలం తర్వాత తను అనుకున్న సేఫ్ లైన్ ను దాటాడు అని ఖచ్చితంగా అనుకోవచ్చు. అటు అనిల్ రావిపూడి కూడా అలాగే కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి సరికొత్త కథ, కథనాలతో తమను తాము మార్చుకున్నట్టుగానూ ప్రూవ్ చేసుకునేలా రాబోతున్నారా అనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ సైతం రెగ్యులర్ బాలయ్య మార్క్ టీజర్ కాదు. ఆ లౌడ్ నెస్ చాలా తగ్గింది. సెటిల్డ్ గా ఉంది. ఇవే కాదు. హీరోయిన్ల విషయంలోనూ మార్పు కనిపిస్తోంది.

మామూలుగా బాలయ్య సినిమా అంటే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కామన్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మారుతున్నాడు. అఖండలో ఒక్కరే హీరోయిన్. వీర సింహారెడ్డిలో ఇద్దరు ఉన్నా పాత్రల మేరకు సెట్ అయింది. భగవంత్ కేసరిలో కాజల్ కనిపిస్తున్నా.. తను రెగ్యులర్ బాలయ్య మార్క్ హీరోయిన్ పాత్ర చేస్తున్నట్టుగా లేదు. మొత్తంగా ఈ నెల 19న విడుదల కాబోతోన్న భగవంత్ కేసరి హీరోతో పాటు దర్శకుడు కూడా తమ సేఫ్ లైన్స్ ను దాటి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి వీరి ప్రయత్నం బ్లాక్ బస్టర్ గా మారుతుందా లేదా అనేది చూడాలి.

Updated : 5 Oct 2023 3:25 PM IST
Tags:    
Next Story
Share it
Top