దుల్కర్ని నిలబెట్టిన హీరోయిన్.. అప్పుడు రానా ఏం చేశాడంటే..?
X
దుల్కర్ సల్మాన్.. తన సినిమాలతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మహానటితో తెలుగులో అడుగుపెట్టిన ఈ హీరో.. సీతారామంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. మలయాళంలో అతడు నటించిన సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం దుల్కర్ కింగ్ ఆఫ్ కోత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరగ్గా.. రానా, నాని గెస్టులుగా వచ్చారు.
ఈ ఈవెంట్లో రానా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. దుల్కర్ యాక్టింగ్ స్కూల్లో తన జూనియర్ అని అన్నారు. చాలా మంచి మనిషితో పాటు సున్నితమైన వ్యక్తి అని.. పక్కవాళ్లను అస్సలు ఇబ్బంది పెట్టరు అని చెప్పారు. దుల్కర్ నటించే ఓ సినిమా షూటింగ్కు తాను వెళ్లినప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని రానా వివరించాడు.
‘‘ దుల్కర్ ఒక బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. నిర్మాతలు నా ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గరే షూటింగ్ కావడంతో సెట్ కు వెళ్లాను. సీన్ మధ్యలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాళ్ళ భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. అది కూడా షాపింగ్ గురించి. ఆమె ఫోన్ అయ్యేదాకా దుల్కర్ అక్కడే సెట్లో నిలబడి ఉన్నాడు. ఆమె నన్ను చూసి నా దగ్గరికి వస్తుంటే షాట్ రెడీగా ఉంది వెళ్ళండి అని పంపించాను. మళ్ళీ ఇంకో ఫోన్ కోసం వెళ్ళింది షాట్ గ్యాప్లో. నాకు కోపం వచ్చి చేతిలో ఉన్న బాటిల్ ను నేలకేసి కొట్టా. కానీ దుల్కర్ మాత్రం అక్కడే ఓపికతో నిలబడి యాక్ట్ చేశాడు. షూట్ అయ్యాక ఆమె హడావిడి చేసుకుంటూ తన స్టాఫ్తో మూడు కార్లలో వెళ్తే.. దుల్కర్ సింపుల్గా ఒక కార్ లో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిర్మాతలకు ఓ 20నిమిషాల క్లాస్ తీసుకున్నాను’’ అని రానా చెప్పారు.
రానా చెప్పిన హీరోయిన్ ఎవరై ఉంటారా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. దుల్కర్ జోయా ఫ్యాక్టర్ అనే బాలీవుడ్ మూవీలో నటించారు. అందులో సోనం కపూర్ హీరోయిన్గా నటించింది. రానా చెప్పింది ఆమె గురించేనా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా కింగ్ ఆఫ్ కోత మూవీని అభిలాష్ జోషి డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ, హీరోయిన్గా నటిస్తోంది. అగస్ట్ 24న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Rana Daggubati about Dulquer’s calm & composed behaviour. #KingOfKotha
— Aakashavaani (@TheAakashavaani) August 13, 2023
Watch it & guess who the heroine is. pic.twitter.com/1grkmlKdEX