పెళ్లిపీటలు ఎక్కబోతున్న రానా తమ్ముడు.. అమ్మాయి ఎవరో తెలుసా
X
త్వరలో దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రానా తమ్ముడు అభిరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో టాలీవుడ్ కి చెందిన ఓ నటి అతడిపై తీవ్ర ఆరోపణలు చేసి నానా రచ్చ చేసిన సంగతి తెల్సిందే. ఇక ఆ ఇన్సిడెంట్ అభిరామ్ కెరీర్ ను చాలా దెబ్బతీసింది. ఇవేమి జరగకుండా ఉంటే.. అభిరామ్ తెలుగుతెరకు ఎప్పుడో పరిచయమయ్యేవాడు. కానీ, అనుకోని సంఘటనలు జరగడంతో ఈ ఏడాది అహింస సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అతనికి ఆశించిన ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి కుటుంబం అతడికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే అమ్మాయిని కూడా వెతికినట్లు తెలుస్తోంది.
అభిరామ్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. వాళ్ళ బంధువుల అమ్మాయినే అట. రామానాయుడు తమ్ముడి మనవరాలినే(రామానాయుడు తమ్ముడి కూతురు బిడ్డ) అభిరామ్ కి కాబోయే భార్యగా కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివాహం జరగడం దాదాపు ఖాయం అని.. ఇక దగ్గుబాటి కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన మాత్రమే రావలసి ఉందని అంటున్నారు. హీరోగా ఎంట్రీ కాకముందే అనేక వివాదాల్లో అభిరామ్ నిలిచాడు. ఇప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రానా ప్రేమ వివాహం చేసుకోగా.. అభిరామ్ మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటున్నాడు. త్వరలోనే అధికారికంగా దగ్గుబాటి కుటుంబం అభిరామ్ పెళ్లి విషయం ప్రకటించనుంది. మరి దగ్గుబాటి కుటుంబం అనుకున్నట్లుగానే అభిరామ్ లైఫ్ పెళ్లి తరువాత మారుతుందేమో చూడాలి.