Home > సినిమా > Kubera : బిచ్చగాడిలా ధనుష్..టైటిల్ రిలీజ్

Kubera : బిచ్చగాడిలా ధనుష్..టైటిల్ రిలీజ్

Kubera : బిచ్చగాడిలా ధనుష్..టైటిల్ రిలీజ్
X

తమిళ హీరో ధనుష్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మొన్న 'సార్' మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ధనుష్ ఇప్పుడు మరో తెలుగు సినిమా టైటిల్‌ను ప్రకటించాడు. ఈ మూవీలో అక్కినేని నాగార్జున కూడా ఉండటం విశేషం. 'నాసామిరంగ' మూవీ హిట్‌తో దూసుకుపోతున్న నాగ్ ఇప్పుడు ధనుష్‌ సినిమాలో కీలక పాత్ర చేయనున్నాడు. ఈ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో #DNS వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేసింది.

'సార్' మూవీ తెలుగులో భారీ హిట్ సాధించింది. ఆ క్రేజ్‌తోనే ఇప్పుడు ధనుష్ మరో డైరెక్ట్ తెలుగు సినిమాను ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీని 2025లోనే థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా నేడు ధనుష్ మూవీ టైటిల్‌ పోస్టర్‌ను, వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

'కుబేర' అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు. శివరాత్రి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేశారు. ఈ మూవీ పోస్టర్‌లో ధనుష్ బిచ్చగాడిలా కనిపిస్తున్నాడు. ధనుష్ వెనకవైపు శివుడు, అన్నపూర్ణాదేవి ఫోటోలు ఉన్నాయి. ధనుష్ లుక్‌ను చూసి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీని తెరకెక్కిస్తుండటంతో అందరూ మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

ఇప్పటి వరకూ క్యూట్ లవ్ స్టోరీస్‌నే తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నాడని అనిపిస్తోంది. మొదటిసారి శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి వేరే జోన్‌లో సినిమాలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ధనుష్ కూడా 'కుబేర' మూవీలో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీని అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లోనూ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 'కుబేర' మూవీ టైటిల్ అనౌన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated : 8 March 2024 8:23 PM IST
Tags:    
Next Story
Share it
Top