Jagapathi Babu: 'నా అభిమాన సంఘాలకు, నాకు ఎలాంటి సంబంధం లేదు'.. జగపతి బాబు
X
ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకు సైతం ఫ్యాన్స్ ఉండడం సర్వసాధారణం అని తెలిసిన విషయమే స్టార్ హీరోలకు కోట్లల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే మీడియం రేంజ్ లో హీరోలకు అంతలా కాకపోయినా ఎంతోకొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అయితే కొన్ని సార్లు అభిమానం అనే పేరు చెప్పుకొని మితిమీరిగా ప్రవర్తిస్తూ ఉంటారు.. అలా తెలుగులో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన జగపతిబాబుకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందట. దీంతో ఫ్యాన్స్ కి దండం పెట్టి మరి ఓ ట్వీట్ చేశారు
అప్పట్లో ఎన్నో చిత్రాలలో హీరోగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ మ్యాన్లీ హీరో ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక ఆయనకు మరింత క్రేజ్, డిమాండ్ కూడా పెరిగింది. అయితే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం షాకిస్తుంది. ఇకపై తనకు, తన పేరుతో ఉన్న అభిమాన సంఘాలకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ట్రస్ట్ కి కూడా తాను దూరం అవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు.
ఇందులో జగపతిబాబు... `33ఏళ్లగా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లాగా నా అభిమానులు కూడా నా పెరుగుదలకి ముఖ్యకారణంగా భావించాను. అలాగే వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి వాళ్లు నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నా. అభిమానులంటే అభిమానం ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మాను. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కొంత మంది అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా, బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటి నుంచి విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను` అని వెల్లడించారు జగపతిబాబు. జీవించండి, జీవించనివ్వండి అని పేర్కొన్నారు జగపతిబాబు.
దీంతో అభిమానులు సైతం ఆయనకు సపోర్ట్ గా నిలుస్తుంది. మంచి నిర్ణయమని అంటున్నారు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అండగా ఉంటే చాలు అంటున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది. జగపతిబాబు ఇటీవల `రుద్రంగి` చిత్రంతో మంచి ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం `సలార్` వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు.
నా అభిమానులకు మనవి…. pic.twitter.com/iLN9tToL7T
— Jaggu Bhai (@IamJagguBhai) October 7, 2023