Home > సినిమా > ఇండిపెండెన్స్ రోజు కళ్యాణ రామ్ స్పెషల్ విషెస్..

ఇండిపెండెన్స్ రోజు కళ్యాణ రామ్ స్పెషల్ విషెస్..

ఇండిపెండెన్స్ రోజు కళ్యాణ రామ్ స్పెషల్ విషెస్..
X

కళ్యాణ్ రామ్.. హిట్, ఫ్లాప్తో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల రిలీజైన బింబిసారా హిట్ అవ్వగా.. అమిగోస్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆయన నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ అనే మూవీ చేస్తున్నాడు. ఇండియాకు స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేసే సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ‘‘మనసులో ఉన్న భావన.. ముఖంలో తెలియకూడదు. మొదడులో ఉన్న ఆలోచన.. మాటల్లో బయటపడకూడదు. అదే.. గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం’’ అని కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ హైలెట్గా నిలిచింది. ఇక ఈ మూవీ నవంబర్ 24న విడుదల కానుంది. ఇక స్వాతంత్ర్య దినోవ్సతాన్ని పురస్కరించుకుని మూవీ యూనిట్ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. 101 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని అందులో చెప్పింది.

ఇక ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కానుంది. శ్రీకాంత్ విస్సా ఈ మూవీకి కథ, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించగా.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిఫరెంట్ స్టోరీతో వస్తున్న ఈ మూవీ తప్పకుండా హిట్ సాధిస్తుందని చెబుతున్నారు.



Updated : 15 Aug 2023 1:53 PM IST
Tags:    
Next Story
Share it
Top