చిరంజీవిని విమర్శిస్తే బాధగా ఉందన్న యువ హీరో..
X
మెగాస్టార్ చిరంజీవి అభిమానుల లిస్ట్‌లో హీరో కార్తికేయ ఒకరు. గతంలో ఓ డ్యాన్స్ షో లో చిరంజీవి పాటలకు కార్తికేయ అదరగొట్టారు. కార్తికేయ ఫెర్ఫార్మెన్స్‌కు చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. తాజాగా కార్తికేయ 'బెదురులంక 2012' చిత్రంతో ముందుకొస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కు చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అని కార్తికేయ పెట్టుకున్నారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతోనే తన సినిమాలో తన క్యారెక్టర్ కు చిరంజీవి అసలు పేరు పెట్టుకున్నానని కార్తికేయ చెప్పారు. ట్రైలర్‌ను రామచరణ్ లాంఛ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఓ ఇంటరర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ.. చిరంజీవి, భోళాశంకర్ సినిమాపై వస్తున్న ట్రోల్స్ పై మండిపడ్డారు. చిరంజీవిని ఎవరైనా విమర్శిస్తే బాధేస్తుందని చెప్పారు. సినిమాను బాగాలేదు, నచ్చలేదు అనడం ఓకేగానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. చిరంజీవినే కాదు అలా ఎవరినీ అనకూడదని కార్తికేయ వెల్లడించాడు. మెగాస్టార్ చూడని హిట్స్ ,ప్లాప్‌లు కాదని..ఆయన చూసిన ఒడిదొడికులు ముందు ఇది చాలా చిన్న విషయమన్నారు. ఇవన్నీ పక్కనబెట్టి కొత్త సినిమాతో చిరంజీవి ముందుకొస్తారని కార్తికేయ అభిప్రాయపడ్డాడు.