నమ్రతతో కలిసి లండన్ చెక్కేసిన మహేశ్ బాబు..పిక్స్ వైరల్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి ఫారెన్ కంట్రీస్‌కు చెక్కేస్తుంటారు. హైదరాబాద్‌లో ఉండేకంటే ఎక్కువగా విదేశాల్లో గడిపేస్తుంటారు. లండన్, పారిస్ దుబాయ్ వంటి దేశాల్లోని ప్రముఖ నగరాల్లో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు మహేశ్ బాబు. తాజాగా "గుంటూరు కారం" చిత్రం కొత్త షెడ్యూల్ పూర్తి కావడంతో తన భార్య నమ్రత , పిల్లలతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ ఓ రెస్టారెంట్లో మహేష్ కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేశారు. లండన్ లో ప్రీ బర్డ్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు! ఆ ఫోటోలను నమత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘లండన్ కాలింగ్’ అనే క్యాప్షన్ తో ఫోటోలను పోస్ట్ చేయగా అవి క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో మహేశ్ టీ షర్ట్ వేసుకుని ఎంతో కూల్‌గా కనిపించారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందుతున్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ షూటింగ్‌తో మహేశ్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో షూటింగ్‌కు కాస్త బ్రేక ఇచ్చినట్లు ఈ పోస్ట్‌తో అర్ధమవుతోంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల , మీనాక్షి చౌదరిలు కథానాయికలు. అతడు , ఖలేజా వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.