Home > సినిమా > మా పై ట్రోల్ చేయిస్తోంది ఎవరో అందరికీ తెలుసు : మంచు విష్ణు

మా పై ట్రోల్ చేయిస్తోంది ఎవరో అందరికీ తెలుసు : మంచు విష్ణు

మా పై ట్రోల్ చేయిస్తోంది ఎవరో అందరికీ తెలుసు : మంచు విష్ణు
X

మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ వస్తుంటాయి. వారు ఏం మాట్లాడినా వైరల్ చేస్తుంటారు. ప్రధానంగా మంచు విష్ణు, మంచు లక్ష్మిలు ట్రోలింగ్‎కు గురవుతారు. మా ఎన్నికలు, సన్ ఆఫ్ ఇండియా, జిన్నా సినిమాల సమయయంల ఈ ట్రోలింగ్ హద్దులు దాటింది. దీంతో చర్యలు తీసుకునేందుకు అప్పట్లో మంచు ఫ్యామిలీ రంగంలోకి దిగింది. మీడియా వేదికగానే మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా తమ మీద ట్రోలింగ్‌పై మరోసారి విష్ణు స్పందించారు. శ్రుతిమించిన ట్రోలింగ్ బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. " తమపై ట్రోలింగ్ చేయిస్తున్నది ఎవరో అందరికీ తెలుసు. మాపై ట్రోలింగ్ చేస్తున్నది స్నేక్ బ్యాచ్ పనే. డబ్బులిచ్చి మరీ ట్రోల్ చేయిస్తున్నారు. మా ఎలక్షన్ టైం నుంచి నాపై ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడు అనవసరం.ట్రోలింగ్‎ను మేమే పెద్దగా పట్టించుకోం. అయితే శృతిమించితే మాత్రమే సహించేది లేదు. కొంతమంది తమ మీద వేసే సెటైర్లను చూసి నవ్వుకుంటాం" అని మంచు విష్ణు తెలిపారు. అయితే మంచు విష్ణు నాగబాబునే ఉద్దేశించి స్నేక్ బ్యాచ్ అన్నారని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను శ్రీకాళహస్తిలో చేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. కన్నప్ప సినిమాను సుమారు 100 కోట్లతో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



Updated : 19 Aug 2023 11:56 AM IST
Tags:    
Next Story
Share it
Top