శ్రీకాకుళం వెళ్లిన నాగ చైతన్య ..జాలర్లతో ముచ్చట
X
టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. చందూ మొండేటి డైరెక్షన్లో చై పాన్ ఇండియా స్థాయిలో మూవీ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పైన ఈ మూవీ తెరకెక్కబోతోంది. మత్స్యకారులు జీవితాల్లో సంభవించిన వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొత్త సినిమాపై నాగ చైతన్య కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగా మత్స్యకార కుటుంబాలను దగ్గరుండి చూడాలనే ఉద్దేశంతో నాగచైతన్య శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని కే. మత్స్యలేశం గ్రామంలో పర్యటించాడు. చై తో పాటు డైరెక్టర్ చందు, ప్రొడ్యూజర్ బన్నీ వాసు కూడా శ్రీకాకుళం చేరుకున్నారు. సినీ నటుడు తమ గ్రామానికి రావడంతో అతడిని చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు.
ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.."ఆరునెలల క్రితమే చందూ కథ చెప్పారు. కథను విని నేను చాలా ఇన్స్ఫైర్ అయ్యాను. అందుకే మత్స్య కారులతో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. వారి జీవన విధానం, స్థితిగతులను పరిశీలించాను. సిక్కోలు మత్స్యకారుల యాస, బాస , వ్యవహారి శైలని తెలుకున్నాను." అని చైతన్య తెలిపాడు.
2018లో గుజరాత్ విరావల్ నుంచి 21 మది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. అయితే వారు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ జాలర్లను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ బంధించారు. ఆ తరువాత కేంద్ర సర్కార్ చొరవ తీసుకుని చేసిన సంప్రదింపులు ఫలించడంతో మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ జాలర్ల కథ ఆధారంగే నాగ చైతన్య కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీలో పాక్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కిన మత్స్యలేశం గ్రామానికి చెందిన జాలరైన గణగల్ల రామరావు పాత్ర పోషిస్తున్నాడని టాక్. అందుకే అతడిని కలవడానికి శ్రీకాకుళం వచ్చాడని తెలుస్తోంది.
Pictures from the interaction of Yuvasamrat @chay_akkineni with fisherman family#NC23🌊 #NagaChaitanya pic.twitter.com/r8YFf0KQW8
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 3, 2023