Home > సినిమా > FNCC ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన నాగ శౌర్య

FNCC ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన నాగ శౌర్య

FNCC ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్  ప్రారంభించిన నాగ శౌర్య
X

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) మరియు తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ (TSTA) సహకారంతో FNCC ఆల్ ఇండియా మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఇది టెన్నిస్ మరియు క్రీడాస్ఫూర్తి యొక్క అద్భుతమైన ప్రదర్శనను అందిస్తుంది. FNCC కి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే ఇటువంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను FNCC నిర్వహించడం ఇదే మొదటిసారి.

హీరో నాగ శౌర్య, అర్జున్ అవార్డు గ్రహీత సాకేత్ మైనేని గౌరవనీయ ప్రముఖులతో కలిసి ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. FNCC క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ జి ఆది శేషగిరిరావు గారు, శ్రీ చాముండేశ్వరి నాథ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ FNCC మరియు సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ శ్రీ V.V.S.S పెద్ది రాజు, మరియు కమిటీ సభ్యులు శ్రీ కాజా సూర్యనారాయణ , , శ్రీ ఏడిద సతీష్ (రాజా), టీఎస్టీఏ అధ్యక్షుడు కే. ఆర్. రామన్, టీ ఎస్ టీ ఏ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్, టీ ఎస్ టీ ఏ కార్యదర్శి వెల్మటి నారాయణదాస్ ,జగదీష్ గారు, మధుగారు, సందీప్ గారు రామరాజు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ : గతంలో కూడా FNCC నుంచి చాలా కార్యక్రమాలు చేసాము. ఇప్పుడు ఈ టెన్నిస్ టోర్నమెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్ చేసి ముందుకొచ్చిన మా స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కూడా అడగ్గానే మా మనవిని మన్నించి ఈవెంట్ కి విచ్చేసిన హీరో శ్రీ నాగ శౌర్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.

హీరో శ్రీ నాగ శౌర్య గారు మాట్లాడుతూ : ఈ సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు నేను కూడా ఒక టెన్నిస్ ప్లేయర్ని. స్టేట్ లెవెల్ టోర్నమెంట్ వరకు ఆడాను. ఇండస్ట్రీలోకి వచ్చి టెన్నిస్ కి దూరమయ్యాను. ఇప్పుడు FNCC తరఫున ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టి స్పోర్ట్స్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయం. ఈవెంట్ కి నన్ను గెస్ట్ గా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ లో నన్ను కూడా భాగం చేసినందుకు అది శేషగిరిరావు గారికి, ముళ్ళపూడి మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆటగాళ్లందరూ ఈవెంట్ కోసం ఎంత ఎక్సయిటెడ్ గా ఉన్నారో తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ బాగా ఆడాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Updated : 6 April 2024 12:59 PM GMT
Tags:    
Next Story
Share it
Top