Home > సినిమా > చడీచప్పుడు లేకుండా ఓటీటీల్లోకి వచ్చేసిన నిఖిల్ స్పై

చడీచప్పుడు లేకుండా ఓటీటీల్లోకి వచ్చేసిన నిఖిల్ స్పై

చడీచప్పుడు లేకుండా ఓటీటీల్లోకి వచ్చేసిన నిఖిల్ స్పై
X

బోలెడు ఆశల మధ్య రిలీజ్ అయింది నిఖిల్ స్పై మూవీ. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద నిఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అంతకు ముందు వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవల్ లో హిట్ అవ్వడం వలన స్పై కూడా హిట్ అవుతుందని అనుకున్నారు. అందుకే దీన్ని కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. కానీ స్పై డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా ఓటీటీల్లోకి రిలీజ్ చేశారు.

మామూలుగా ఏ సినిమా అయినా ఓటీటీల్లోకి వస్తుంది అంటే ముందుగానే అనౌన్స్ మెంట్ ఉంటుంది. థియేటర్లలో ఆడని సినిమాలకు కూడా ఫలానా రోజు ఓటీటీల్లోకి వస్తోందని పెద్దగా ప్రచారం చేస్తున్నారు. దానికి కారణం థియేటర్లలో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీల్లో సక్సెస్ అవడమే కారణం. కానీ నిఖిల్ స్పై సినిమాను మాత్రం ఎవ్వరికీ తెలియకుండా ఓటీటీలో విడుదల చేసేసారు. గురువారం అంటే ఈరోజు ఉదయం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్పై సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

భారత యోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలను చేధించే కథ ఆధారంగా స్పై మూవీ వచ్చింది. జూన్ 29న రిలీజ్ అయింది ఈ మూవీ. అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన స్పై సినిమా ఆశించినట్టుగా ఆడలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్ట్రీమింగ్ అవుతోంది.

Updated : 27 July 2023 10:57 AM IST
Tags:    
Next Story
Share it
Top