Home > సినిమా > వాళ్లు నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నరు.. కానీ.. : హీరో నిఖిల్

వాళ్లు నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నరు.. కానీ.. : హీరో నిఖిల్

వాళ్లు నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నరు.. కానీ.. : హీరో నిఖిల్
X

డ్రగ్స్, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలని, ఒకసారి వాటికి అలవాటు పడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని టాలివుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మాదకద్రవ్యాల నిరోధక ‘పరివర్తన’ కార్యక్రమంలో కమెడియన్ ప్రియదర్శితో పాల్గొన్న నిఖిల్.. యువతను ఉద్ధేశించి మాట్లాడారు. ‘నేను కూడా పార్టీలకు వెళ్తుంటా. అప్పుడు నన్ను కూడా చాలామంది డ్రగ్స్ తీసుకొమ్మని అడిగారు. అలాంటి వాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటానని వాళ్లతో చెప్పా. ప్రతీ ఒక్కురు కూడా ఇదే వనిచేయాలి. స్టూడెంట్స్ వీటికి తొందరగా అడిక్ట్ అవుతుంటారు. పార్టీలకు వెళ్లినప్పుడు సరదాకైనా వాటి వైపు వెళ్లకండి. దాన్ని దాటివస్తే అందమైన జీవితం ఉంటుంది. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. త్వరలోనే తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని అనుకుంటున్నా’ అని అన్నాడు.

నాకు సిగరెట్ అలవాటు ఉండేది: ప్రియదర్శి

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రియదర్శి.. ఒకప్పుడు తాను కూడా సిగరెట్స్ తాగేవాడినని చెప్పాడు. తన శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా ఆ అలవాటు మానుకున్నానని, అప్పటి నుంచి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపాడు. డ్రగ్స్ వల్ల కలిగే ప్రభావాల గురించి అందరు తెలుసుకోవాలని అన్నాడు.




Updated : 24 Jun 2023 5:48 PM IST
Tags:    
Next Story
Share it
Top