Home > సినిమా > రామ్ చరణ్ చేతుల్లో క్లింకార.. ఎమోషనల్ వీడియో రిలీజ్

రామ్ చరణ్ చేతుల్లో క్లింకార.. ఎమోషనల్ వీడియో రిలీజ్

రామ్ చరణ్ చేతుల్లో క్లింకార.. ఎమోషనల్ వీడియో రిలీజ్
X

మెగా ఇంట సందడి మొదలై అప్పుడే నెల రోజులు అయిపోయింది. 11 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. మెగా ప్రిన్సెస్ కొనిదెల ఇంట సంతోషాన్ని తీసుకొచ్చింది. జులై 20న తన సతీమణి ఉపాసన పుట్టిరోజు, అలాగే తన కూతురు క్లింకారా పుట్టి నెల రోజులు అయిన సంద్భంగా.. రామ్ చరణ్ ఎమోషనల్ వీడియో ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. అందులో బాగా ఎమోషనల్ అయిన రామ్ చరణ్.. ఉపాసన, క్లింకారా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి క్లిప్ తో మొదలైన వీడియో.. క్లింకార ను హాస్పిటల్ కు తీసుకెళ్లడం, ఫ్యామిలీలో సంతోషాలు, నామకరణ మహాత్సవం అంతా కనిపిస్తుంది. అందులోనే రామ్ చరణ్, ఉపాసన తమ భావోద్వేగాల్ని అభిమానులతో పంచుకున్నారు.

‘మా పెళ్లై అప్పుడే పదకొండేళ్లు అయిపోయాయి. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసింది. ఈ క్రమంలో చాలామంది మమ్మల్ని వాళ్ల మాటలతో బాధపెట్టారు. పెళ్లై ఇన్నేళ్లైనా ఏం చేస్తున్నారు?అని ఇబ్బంది పెట్టేవాళ్లు. దానివల్ల చాలా ఒత్తిడికి గురయ్యాం. ఏదైనా సరైన టైంలో జరుగుతుందని నేను నమ్ముతా. ఆ నమ్మకంతోనే క్లింకార సరైన టైంలో మా జీవితాల్లోకి అడుగుపెట్టింది. తనను ఎత్తుకున్న మొదటి క్షణం ఎంతో సంతోషంగా అనిపించింద’ని రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు.

‘ఈ తొమ్మిది నెలలు చాలా సరదాగా గడిచిపోయాయి. ఆ తర్వాత అసలైన ఆట మొదలయింది. అమ్మనవడంతో నేను పరిపూర్ణమయ్యా. మా పాపపై అభిమానులు చేపిస్తున్న అమితమైన ప్రేమకు ధన్యవాదాలు. మెగా ప్రిన్సెస్ గా పాపకు ఇప్పుడే ట్యాగ్స్ ఇవ్వడం నాకు నచ్చడం లేదు. హార్డ్ వర్క్ తో వాళ్లే టైటిల్స్ సంపాధించుకోవాల’ని అదే వీడియోలో ఉపాసన చెప్తుంది.


Updated : 20 July 2023 6:45 PM IST
Tags:    
Next Story
Share it
Top