Home > సినిమా > కూతురికి రూ.250 కోట్ల బంగ్లాని గిఫ్ట్‌గా ఇచ్చిన రణ్‌బీర్

కూతురికి రూ.250 కోట్ల బంగ్లాని గిఫ్ట్‌గా ఇచ్చిన రణ్‌బీర్

కూతురికి రూ.250 కోట్ల బంగ్లాని గిఫ్ట్‌గా ఇచ్చిన రణ్‌బీర్
X

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌కు ఏడాదిన్నర పాప ఉన్న సంగతి తెలిసిందే. ముత్తాత రాజ్ కపూర్ పోలికలతో 2022లో వీరికి 'రహ' అనే పాప పుట్టింది. తన క్యూట్ లుక్స్‌తో అందర్నీ ఫిదా చేసే రహకు తన తండ్రి రణ్‌బీర్ కపూర్ ఓ భారీ బహుమతిని ఇచ్చాడు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ‘కృష్ణ రాజ్’ బంగ్లాని తన కూతురి పేరు మీద రాసేశారు.

ఆ బంగ్లా విలువ అక్షరాలా రూ.250 కోట్లు అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఏడాదిన్నర పాపకు ఇంత కాస్ట్లీ ఇవ్వడంపై కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ బంగ్లాస్ కంటే ఈ బంగ్లా ధర చాలా ఎక్కువనే చెప్పాలి. ఈ బంగ్లాని రణ్‌బీర్ తన కూతురి పేరు మీద రాయడంతో బాలీవుడ్ లోనే యంగెస్ట్ రిచ్ కిడ్‌గా రహ నిలిచిపోయింది.

ఇకపోతే రణ్‌బీర్, అలియాకి ఈ బంగ్లాతో పాటు మరో నాలుగు బంగ్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. రణ్‌బీర్ ప్రస్తుతం రామాయణం కథలో నటించనున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Updated : 30 March 2024 9:01 AM IST
Tags:    
Next Story
Share it
Top