నెక్ట్స్ ఇయర్ కూడా రవితేజ తీన్మార్
X
మాస్ మహరాజ్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు రవితేజ. కొన్నాళ్లుగా రిజల్ట్స్ తో పనిలేకుండా.. వైవిధ్యమై కథలతో ప్రయాణం చేస్తున్నాడు. అతని పేరు చెప్పగానే ఒక ఇమేజ్ కళ్లముందు కనిపిస్తుంది. ఆ ఇమేజ్ వల్లే కొన్నాళ్ల క్రితం వరుస డిజాస్టర్స్ చూశాడు. ఆడియన్సెస్ కు మొనాటనీ వచ్చేసింది. అందుకే రూట్ మర్చాడు. డిఫరెంట్ స్టోరీస్ తో వెళుతున్నాడు. బట్ ఈ సారి ఎగ్జిక్యూషన్ లోపం వల్ల.. దర్శకుల వల్ల.. ఫ్లాపులు చూస్తున్నాడు. చాలా ప్రామిసింగ్ గా కనిపించిన రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర అలా పోయినవే. లేటెస్ట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కూడా కొంత వరకూ నెగెటివ్ రివ్యూస్ చూసింది. కలెక్షన్స్ పరంగా బాగానే ఉన్నా.. ఈ సినిమాను ఇంకా బాగా తీయొచ్చు అనే మాటలు ఎక్కువగా వినిపించాయి. మొత్తంగా ఒక సినిమా పూర్తయిన తర్వాత దాని గురించి ఎక్కువగా ఆలోచించడు రవితేజ. తర్వాతేంటీ అనేదానిపైనే ఫోకస్ పెడతాడు. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదలవుతుంది. ఇక లేటెస్ట్ గా మరోసారి గోపీచంద్ మలినేనితో సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ సారి మరిన్ని అంచనాలుంటాయి. మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ 2024 సమ్మర్ లేదా మాన్ సూన్ టార్గెట్ గా మొదలవుతుందట. ఇక నెక్ట్స్ మరోసారి మాస్ డైరెక్టర్ వివి వినాయక్ తో మూవీ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. వీరి కాంబోలో వచ్చిన కృష్ణ యాక్షన్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం వినాయక్ ఫామ్ లో లేడు. అయినా ఇలాంటి వారిని మళ్లీ ఫామ్ లోకి తేవడంలో రవితేజ ఎక్స్ పర్ట్. అందుకే ఆయనకు మరో అవకాశం ఇచ్చాడంటున్నారు. ఈ మూవీ కూడా స్టార్ట్ అయితే నాన్ స్టాప్ షూటింగ్ తో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. సో.. 2024లో ఖచ్చితంగా మూడు సినిమాలు విడుదలవుతాయి. ఏదేమైనా ఈ వేగం వల్ల అప్పుడప్పుడూ కంటెంట్ మైనస్ అవుతుంది. అది కూడా కాస్త చూసుకుంటే.. సినిమాలకు కాసులు కూడా వస్తాయి.