పూరీ బ్రదర్ రీఎంట్రీ..'వెయ్ దరువెయ్' మూవీ రివ్యూ
X
టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే హీరోగా ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. కొంతకాలంగా ఆయన సినిమాలు చేయడం లేదు. అయితే తాజాగా వెయ్ దరువెయ్ మూవీతో సాయిరామ్ శంకర్ రీఎంట్రీ ఇచ్చారు. కొత్త దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు ఆ మూవీని నిర్మించారు. ఈ మూవీతో కన్నడ భామ యష శివకుమార్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. మరో హీరోయిన్ హెబ్బాపటేల్ ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది.
కథ ఏంటంటే:
హీరో సాయిరామ్ శంకర్ ఇందులో కామారెడ్డి శంకర్‌గా కనిపిస్తాడు. బి.టెక్ బ్యాక్ లాగ్స్‌తో ఖాళీగా ఉండే అతను హైదరాబాద్‌లో సత్యం రాజేష్ దగ్గరికి జాబ్ చేయడానికి వెళ్తాడు. అక్కడే హీరోయిన్ శృతి కనిపిస్తుంది. శృతి వెంటపడటం మొదలెడుతాడు. అయితే షాపింగ్ చేసిన ఆమె హీరోతో పదివేల రూపాయలు కట్టించి ఎస్కేప్ అవుతుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ ఫేక్ సర్టిఫికెట్స్ పెడితే జాబ్ వస్తుందంటాడు. అందుకోసం రెండు లక్షలు అవసరం అవుతాయి. ఓ రౌడీ దగ్గర అప్పు చేస్తాడు. ఫేక్ సర్టిఫికెట్స్ వాళ్లకు ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. కొన్ని రోజులకు ఆ ఫేక్ సర్టిఫికెట్స్ వారిని పోలీసులు పట్టుకుంటారు. అదే టైంలో డబ్బులు ఇవ్వలేదనే కోపంతో సత్యం రాజేష్‌ను రౌడీ తీసుకెళ్లి కిడ్నీ అమ్మేస్తా అని బెదిరిస్తాడు. ఇక శంకర్ ఆ డబ్బులు ఎలా కట్టాడు? హీరోయిన్ ప్రేమలో పడిందా? లేదా? ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల ఎదురైన ఇబ్బందులేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఫేక్ సర్టిఫికెట్స్ చుట్టూ కథ తిరుగుతుంది. సినిమా మొత్తం కామెడీగా నడిచినా ఆఖర్లో మాత్రం ఎమోషన్స్ చూపించారు. ఫస్టాఫ్ అంతా లవ్ సీన్స్, కామెడీ సీన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. సెకండాఫ్ ట్విస్ట్స్ రివీల్ చేస్తారు. చివర్లో ఎమోషన్ సీన్స్‌తో మెప్పిస్తారు. ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల జరిగే ఇబ్బందులు, సమస్యలను చెబుతూ యూత్‌కు ఓ మెసేజ్ అందించారు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సాయిరామ్ శంకర్ ఎనర్జిటిక్ యాక్టింగ్ చేశాడు. సత్యం రాజేష్ కామెడీ అదిరింది. భీమ్స్ సిసిరోలియో మంచి మ్యూజిక్ అందించారు. డైరెక్టర్ నవీన్ రెడ్డికి ఇది తొలి సినిమానే అయినా బాగా చేశాడు.
Mic Tv రేటింగ్: 2/5