రజనీకాంత్ సినిమాలో నానిని రీప్లేస్ చేసిన శర్వానంద్
X
‘జైలర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం రజనీ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. అందులో భాగంగా రీసెంట్గా హిమాలయాల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించిన ఆయన దేశంలోని మరికొన్ని ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఈ యాత్ర ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుంది. ఆ తరువాతే ఆయన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే రజనీ హీరోగా నటించబోయే ఆయన 170 చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్న టాక్ ఇప్పుడు టాలీవుడ్లో జోరుగా వినిపిస్తోంది. అయితే ముందుగా ఈ పాత్ర కోసం న్యాచురల్ స్టార్ నానీని మూవీ టీమ్ సంప్రదించిందట, అయితే బిజీ షెడ్యూల్ కారణంగా నానీ ఈ రోల్‌కు నో చెప్పాడని తెలుస్తోంది. అయితే రజనీ సినిమాలో శర్వా నెగెటివ్ రోల్లో కనిపిస్తాడని సమాచారం. అయినప్పటికీ రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో శర్వా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
‘జై భీమ్’ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్‌తో రజనీకాంత్ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఆధ్యాత్మిక టూర్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ కు హాజరు కానున్నారు. ఆగస్టు నెల చివరికల్లా తన యాత్రను ముగించుకుని సెప్టెంబర్ రెండో వారంలో సినిమాను షూట్ ను పట్టాలకెక్కించనున్నారు. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వచ్చిన హీరో సూర్య నటించిన జై భీమ్ మంచి హిట్ సాధించింది. ఇదే హిట్ ఫార్ములాతో రజనీతో చేసే సినిమాలోనూ సామాజికాంశాలు కలిగివున్న కథతో ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ప్రేక్షకులకు చక్కటి సందేశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుమారు 32 ఏళ్ల విరామం తర్వాత రజనీకాంత్-అమితాబ్‌బచ్చన్ కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేయడం విశేషం.
ఈ మూవీలో కీలకమైన గెస్ట్ రోల్లో హీరో నాని నటించబోతున్నాడని ఈ మధ్యనే కొన్ని వార్తలొచ్చాయి. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నాని ఈ సినిమాను అంగీకరించలేదని తెలిసింది. ఆ పాత్రలో నానిని శర్వా రీప్లేస్ చేశాడని సమాచారం. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాత్ర అయినప్పటికీ రజనీకాంత్ తో తెర పంచుకోవాలనే ఉద్దేశంతో శర్వా ఈ సినిమాకు ఓకే చెప్పాడు. లైకా ప్రొడక్షన్స్‌పై తెరకెక్కబోతోన్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది.