క్రేజీ కాన్సెప్ట్తో మిస్టర్ ప్రెగ్నెంట్ : సోహైల్
X
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించిన ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ కింగ్ నాగార్జున చేతులమీదుగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా మాట్లాడిన సోహైల్ చాలా ఎమోషనల్ అయ్యారు.
ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్లి వాళ్ల తల్లిని హగ్ చేసుకుంటారని సోహైల్ చెప్పారు. ప్రెగ్నెన్సీ అనేది అంతా ఈజీ కాదని.. ఆ ఎక్స్పీరియన్స్ను మగవారు ఫేస్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించామన్నారు. ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్న ఆయన ఈ మూవీ అందరినీ అలరిస్తుందని చెప్పారు. ఇక తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నాగార్జున సర్ వల్లే ఈ స్థాయిలో..
తాను ఈ స్థాయిలో ఉండడానికి నాగార్జునే కారణమని సోహైల్ అన్నారు. ‘‘ బిగ్బాస్ నా కెరీర్కు టర్నింగ్ పాయింట్. ప్రతి వారం నాగ్ సర్ నా పేరు పిలవడం వల్లే పాపులర్ అయ్యారు. ఫైనల్లో నాగార్జున సర్ నన్ను ఎత్తుకోవడం జన్మలో మరిచిపోలేని అనుభూతి. డిప్రెషన్లోకి వెళ్లినప్పుడు నాగ్ సర్ అండగా నిలిచారు. మనలో టాలెంట్ ఉంటే ఎంకరేజ్మెంట్ తప్పక లభిస్తుంది. రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వడం ఖాయం’’ అని అన్నారు.