Home > సినిమా > అన్ని ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ ఒకటే..‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ రిలీజ్

అన్ని ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ ఒకటే..‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ రిలీజ్

అన్ని ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ ఒకటే..‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ రిలీజ్
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో హిట్ కొడుతూ వస్తున్నాడు. ఆ మధ్య బ్రోచేవారెవరురా మూవీతో ఆకట్టుకున్న శ్రీవిష్ణు ఆ తర్వాత వరుసగా కామెడీ, సెంటిమెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు. ఇక శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ కలిశారంటే ఆ మూవీ పక్కా హిట్ కొడుతుందని ఈపాటికే తెలుగు ప్రేక్షకులకు అర్థం అయ్యి ఉంటుంది. తాజాగా ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబోలో వస్తోన్న మూవీ 'ఓం భీమ్ బుష్'. ఈ మూవీ టైటిల్ విన్నవారంతా స్టోరీ ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నారు. టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ క్రేజీ మూవీలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు. 'హుషారు' మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డైరెక్టర్ హర్ష కొనుగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

హిట్ సినిమాలు తీసిన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో 'ఓం భీమ్ బుష్' మూవీ రూపొందుతోంది. మార్చి 22వ తేదీన ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్‌ను మేకర్స్ మొదలెట్టేశారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఈసారి కూడా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ కాంబో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated : 15 March 2024 6:51 PM IST
Tags:    
Next Story
Share it
Top