ఆయనతో అనుబంధం.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య
X
కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్కు హీరో సూర్య నివాళులు అర్పించారు. విజయకాంత్ మరణించినప్పుడు సూర్య విదేశాల్లో షూటింగ్ చేస్తున్నారు. గురువారం ఆయన చెన్నైకు తిరిగొచ్చారు. ఇవాళ విజయకాంత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కెప్టెన్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారాయి.
విజయకాంత్ తనకు పెద్దన్నతో సమానమని సూర్య చెప్పారు. ఆయన మరణం తనను షాక్కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్ ఆరంభంలో 4 సినిమాల్లో నటించినప్పటికీ తనకు గుర్తింపు రాలేదని.. ఆ సమయంలో ‘పెరియన్నా’ సినిమాలో విజయకాంత్తో కలిసి పని చేసినట్లు గుర్తుచేసుకున్నారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేయాలని ప్రోత్సహించేవారని.. తనలో స్ఫూర్తిని నింపేవారని చెప్పారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు.