'కంగువా'తో సూర్య ప్రతాపం చూపిస్తాడా
X
తమిళ స్టార్ హీరో సూర్య 'కంగువా'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది వరకే ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదలై టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కంగువా టీజర్‌లో హీరో సూర్య సింహంలా గర్జించాడు. విజువల్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ సిరుతై శివ.. యాక్షన్ ఫాంటసీ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఫాంటసీ జానర్‌లో శివ ఈ మూవీని చేస్తున్నారు. టీజర్ కోసం కట్ చేసిన సీన్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా ఈ మూవీపై మరింత బజ్‌ను క్రియేట్ చేశాయి.
బాలీవుడ్ నటుడు, యానిమల్ విలన్ బాబీ డియోల్ మధ్య జరిగే భీకర పోరు టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. కంగువా కథ గురించి చెప్పకుండా సీన్స్ కట్ చేసి వదిలారు. టీజన్ చూస్తుంటే ఈ మూవీ సముద్రాలు, గిరిజన ప్రాంతాల్లో జరిగే యుద్ధం గురించి చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. విజువల్స్ పరంగా ఈ మూవీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. హీరో సూర్యతో పాటు విలన్ బాబీ డియోల్ లుక్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. టీజర్లోని ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే ఈ మూవీ విజువల్ వండర్‌గా అనిపిస్తోంది.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేరేలెవల్లో ఉంది. తమిళ ఇండస్ట్రీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ను మరిపించేలా దేవి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ ఈ మూవీలో సూర్య సరసన కనిపించనుంది. అటు సూర్య స్టార్డమ్‌తో పాటుగా ఫాంటసీ కాన్సెప్ట్ తోడై 'కంగువా' బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది.