వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకెళ్లలేం...వెంకటేశ్
X
టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా క్రేజ్ ఉన్నవిక్టరీ వెంకటేష్ ఈ మధ్య తనను తాను తెరముందు కొత్తగా చూపిస్తున్నారు. రీసెంట్గా నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన రానానాయుడులో వెంకీ నటన చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. సిరీస్‌లోని చాలా సన్నివేశాల్లో అసభ్యపదజాలాన్ని వాడటం , శృతిమించిన సీన్స్ ఉండటంతో వెంకీకి కాస్త నెగెటివిటీ వచ్చిన విషయం వాస్తవమే. అయితే సిరీస్‌పై వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్పైన వెంకటేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటిస్తున్న అహింస సినిమా ప్రమోషన్లో మొదటిసారి సిరీస్‌పై వెంకటేశ్ మాట్లాడారు.
అహింస ప్రమోషన్ ఈవెంట్లో వెంకటేశ్ మాట్లాడుతూ.." కొన్ని సీన్స్ కారణంగా ఈ సిరీస్ కొందరిపై ప్రభావం చూపించిన మాట వాస్తవమే. నార్త్‌లో రానానాయుడు సిరీస్‌పై మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసింది. ఫస్ట్ సిరీస్ నచ్చలేదని.. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? అందుకే సెకెండ్ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా తీస్తున్నాం. కచ్చితంగా రెండో సిరీస్‌కు ప్రేక్షకులు పెరుగుతారు. ది బెస్ట్ కంటెంట్‌తో మీ ముందుకు వస్తాం"అని వెంకటేశ్ తన స్పందనను తెలిపారు.