Home > సినిమా > మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ
X

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు . ఖుషి సక్సెస్ సంతోషాన్ని తన అభిమానులతో పంచుకోవడానికి రెడీ అయ్యాడు. శివ నిర్వాణ డైరెక్షన్‎లో సమంత హీరోయిన్‎గా, విజయ్ నటించిన మూవీ ఖుషీ సూపర్ హిట్ అయిన ఖుషీలో 100 మంది ఫ్యాన్స్‎కు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని విజయ్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు విజయ్. ఈ ఆర్థిక సాయం పొందేందుకు ఫ్యాన్స్ ఓ ఫామ్ తీసుకుని రిజిస్టర్ కావాలంటూ పిలుపునిచ్చాడు . ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునేందుకు మరో అడుగు ముందుకు వేశాడు. తాజాగా ఖుషి లక్ష రూపాయలు అందుకునే 100 కుటుంబాల లిస్టును అధికారికంగా విజయ్ తన ఇన్‎స్టాగ్రామ్ వేదికగా అనౌన్స్ చేశాడు. విజయ్ దేవరకొండ ఓ బంగారు కొండ అని నిరూపించుకున్నాడు.

" మేము సెలెక్ట్ చేసిన 100 ఫ్యామిలీలు ఇవే. మా ఈ సహాయం వారి కుటుంబంలో సంతోషాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను" అంటూ అనుకుంటున్నా’అంటూ విజయ్ కుటుంబాల లిస్టును ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇచ్చిన మాటను విజయ్‌ నిలబెట్టుకున్నాడంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Updated : 14 Sept 2023 1:42 PM IST
Tags:    
Next Story
Share it
Top