Home > సినిమా > విక్రమ్ 'తంగలాన్' మళ్లీ వాయిదా

విక్రమ్ 'తంగలాన్' మళ్లీ వాయిదా

విక్రమ్ తంగలాన్ మళ్లీ వాయిదా
X

స్టార్ హీరో విక్రమ్ నటించిన 'తంగలాన్' మూవీ మళ్లీ వాయిదా పడింది. ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమాలు చాలా వరకూ సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్దమవుతుంటాయి. ఆ తర్వాత వేసవికి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. విద్యార్థులకు సెలవులు ఉండటంతో దానిని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలంతా సమ్మర్‌లో సినిమాలు విడుదల చేస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికలు జరగనుండటంతో సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది.

ఏప్రిల్ 12న విక్రమ్ తంగలాన్ విడుదల కానుంది. అయితే ఏప్రిల్ 19న ఎన్నికల జాతర ప్రారంభం కానుంది. కల్కి మూవీ కూడా మే 9న థియేటర్లలోకి రానుంది. దీంతో కల్కి మూవీ తర్వాతే తంగలాన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ముందు నుంచి అందరూ అనుకున్నట్లుగా సినిమా వాయిదా పడింది. ఇక జూన్ నెల తర్వాతే రామ్ డబుల్ ఇస్మార్ట్, అల్లు అర్జున్ పుష్ప-2, నాని సరిపోదా శనివారం, పవన్ ఓజీ, ఎన్టీఆర్ దేవర, నాగ చైతన్య తండేల్ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఈసారి సినీ ఇండస్ట్రీలో పోటీ ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ రేసులో ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మధ్యలో ఎన్నికలు ఉండటం వల్ల ఇప్పుడు చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి.

విక్రమ్ తంగలాన్ కూడా వాయిదా పడితేనే మంచిదని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. తమిళనాడులో అనుకున్న తేదీకి విడుదలైనా ఏపీలో మాత్రం ఆ రోజు విడుదలైతే అంతగా ఆడే అవకాశం లేదు. ఎన్నికల్లో బిజీగా ఉండే సినీ లవర్స్ తంగలాన్ చూసే అవకాశం తగ్గుతుంది. దానివల్ల సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అందుకే తంగాలన్‌ విడుదలను వాయిదా వేసేందుకు మేకర్స్ కూడా చూస్తున్నారు. మరి అనుకున్న తేదీకి తంగలాన్ విడుదల కానుందా? లేక పోస్ట్‌పోన్ కానుందా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Updated : 20 March 2024 8:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top