Home > సినిమా > నేనేమీ బిర్యానీని కాదు...అందరినీ ఆనందంగా ఉంచడానికంటున్న విశ్వక్ సేన్

నేనేమీ బిర్యానీని కాదు...అందరినీ ఆనందంగా ఉంచడానికంటున్న విశ్వక్ సేన్

నేనేమీ బిర్యానీని కాదు...అందరినీ ఆనందంగా ఉంచడానికంటున్న విశ్వక్ సేన్
X

అందరినీ ఆనందంగా ఉంచడానికి నేనేమీ బిర్యానీని కాదంటున్నాడు హీరో విశ్వక్ సేన్. హీరోగా, డైరెక్టర్ గా రాణిస్తున్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో విశ్వక్ ఒకరు. ఇతని సినిమాలు సూపర్ హిట్ కాకపోయినా మంచి టాక్ అయితే తెచ్చుకుంటాయి. అలాగే విశ్వక్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే తాజాగా ఇతను ఓ వివాదంలో చిక్కుకున్నాడు. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ డైరెక్ట్ గా విశ్వక్ మీద ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేశాడు. అప్పటి నుంచి గొడవ అవుతూనే ఉంది.

తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తెలుగు సినిమా బేబి. చిన్న సినిమాగా విడుదల అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే మొదట ఈ కథను పట్టుకుని దర్శకుడు సాయి రాజేష్ విశ్వక్ సేన్ దగ్గరకే వెళ్ళారుట. కానీ అతను కనీసం కథను వినడానికి కూడా ఆసక్తి చూపించలేదని సాయి రాజేష్ ఇన్ డైరెక్ట్ గా విశ్వక్ ని విమర్శించారు. అది విన్న హీరోకి మండింది. దాంతో సమయం వచ్చినప్పుడల్లా దాని మీద సంపందిస్తూనే ఉన్నాడు.

మొన్న నో అంటే నో అనేది మగాళ్ళకు కూడా వర్తిస్తుంది. అందుకే ప్రశాంతంగా, కూల్ గా ఉండండి. రిలాక్స్ అవ్వండి అంటూ దర్శకుడికి కౌంటర్ వేస్తూ ట్వీట్ చేశాడు విశ్వక్ సేన్. సరే దాన్ని అక్కడితో వదిలేస్తే ఏ గొడవా లేదు. తాజాగా మళ్ళీ ఇదే విషయం మీద మాట్లాడాడు. నిన్న జరిగిన పేకమేడలు సినిమా టీజర్ విడుదల ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు విశ్వక్. అక్కడ మళ్ళీ మాటల తూటాలను పేల్చాడు. తానేమీ బిర్యానీని కాదంటూ సాయి రాజేష్ పేరు చెప్పకుండా ఎటాక్ చేశాడు. ఎవరి పనిని బట్టి వారు బిజీగా ఉంటారు. ఎలాంటి సినిమాలు చేయాలి అనే క్లారిటీ లేనప్పుడు వేరే వారి సలహా తీసుకుంటాం. ఒక్కోసారి ఎదుటివారి టైమ్ వేస్ట్ చేయకూడదనుకుంటాం. అందుకే కలవలేం, కథ వినలేం అని దర్శకుడికి చెబుతుంటాం. దానికి కొంతమంది ఫీలవుతుంటారు. ఆ విషయంలో నేనేం చేయలేను కదా. అందరినీ ఆనందంగా ఉంచేందుకు నేను బిర్యానీని కాదు. మన సినిమా విజయవంతమైతే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ, సినిమా బాగుందని ఇతరులను కించపరచకూడదు అంటూ చెప్పుకొచ్చాడు.

బేబి సినిమా అయినందుకు నేను కూడా చాలా ఆనందించాను అంటున్నాడు దాస్ కా దమ్మీ హీరో. మూవీ యూనిట్ కు తాను శుభాకాంక్షలు చెప్పానని...సినిమా ట్రైలర్ బావుందని వాట్సాప్ లో ముందుగా మెసేజ్ చేసింది తానేనని చెప్పాడు. గంటలు గంటలు చర్చించి నో చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అనుకుని తాను అసలు సాయి రాజేష్ ను కలవలేదని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.


Updated : 27 July 2023 3:54 PM IST
Tags:    
Next Story
Share it
Top