Home > సినిమా > ఫ్యాన్స్‌కు బర్త్ డే గిఫ్ట్.. విశ్వక్ సేన్ నెక్ట్స్ మూవీ టైటిల్ అనౌన్స్

ఫ్యాన్స్‌కు బర్త్ డే గిఫ్ట్.. విశ్వక్ సేన్ నెక్ట్స్ మూవీ టైటిల్ అనౌన్స్

ఫ్యాన్స్‌కు బర్త్ డే గిఫ్ట్.. విశ్వక్ సేన్ నెక్ట్స్ మూవీ టైటిల్ అనౌన్స్
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ 'గామి' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. నేడు బర్త్ డే జరుపుకుంటున్న విశ్వక్ తాజా తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన కొత్త మూవీ టైటిల్‌ను రివీల్ చేశాడు.

ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చేస్తున్న విశ్వక్, ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే మరో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.తాజాగా ఆ మూవీ నేమ్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. మెకానిక్ రాకీ అనే టైటిల్‌తో ఆ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీని డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి తెరకెక్కించనున్నారు. కామెడీ, లవ్ జానర్‌లో మెకానిక్ రాకీ మూవీ రానుంది.

టైటిల్ చాలా క్రేజీగా ఉందని విశ్వక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విశ్వక్‌కు విషెస్ చెబుతూ టైటిల్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మెకానిక్ రాకీ మూవీ పోస్టర్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.

Updated : 29 March 2024 1:23 PM IST
Tags:    
Next Story
Share it
Top